India Vs China : ఆపరేషన్ సిందూర్‌పై చైనా ప్రభుత్వ మీడియా ప్రచురిస్తున్న తప్పుడు కథనాలపై భారత్ సీరియస్ అయింది. చైనా ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’కు చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాను ఈరోజు భారత్ బ్లాక్ చేసింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ సిందూర్‌ను భారత సేనలు చేపట్టాయి. అయితే దీనిపై తప్పుడు కోణంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా ‘గ్లోబల్ టైమ్స్’ కథనాన్ని రాసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నందుకు ‘గ్లోబల్ టైమ్స్’కు చెందిన ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసింది.
Also Read :Who Is Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్.. ఎవరు ?
పేర్లను మార్చినంత మాత్రాన..
గతంలో భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్(India Vs China) రాష్ట్రం వ్యవహారంలోనూ చైనా ప్రభుత్వ మీడియా ఇదే విధంగా తప్పుడు కథనాలను వండి వార్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ గుర్తు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను మార్చడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్ అనేది భారత్‌లో అంతర్భాగమని, ఆ రాష్ట్రంలోని పేర్లను మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరని చైనాకు రణ్‌ధీర్‌జైస్వాల్ హితవు పలికారు.
Also Read :KA Paul In Turkey: టర్కీలో కేఏ పాల్.. మిస్సైళ్లు, డ్రోన్లపై సంచలన కామెంట్స్
పేర్లు మార్చేందుకు గతంలోనూ చైనా యత్నాలు
- 2024లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్ పేర్లను చైనా పెట్టింది.
- అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించి 2017 సంవత్సరంలో 6 ప్రదేశాల పేర్లను, 2021లో 15 ప్రాంతాల పేర్లను, 2023లో 11 ప్రాంతాల పేర్లను, చైనా మార్చింది. ఈ ప్రయత్నాలపై ఎప్పటికప్పుడు భారత్ ధ్వజమెత్తింది. చైనాను విమర్శించింది.
- చైనా విదేశాంగ, క్రీడాశాఖల అధికార ప్రతినిధులు గతంలో పలు మీడియా సమావేశాలు వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌పై విషం కక్కారు. తాము పెట్టిన పేరుతో అరుణాచల్ ప్రదేశ్‌ను పిలిచారు. తద్వారా భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేశారు.