PM Candidate : 48 గంటల్లో ప్రధాని అభ్యర్థిపై ప్రకటన.. గతంలో టీడీపీ మా మిత్రపక్షమే : జైరాం రమేశ్

జూన్ 1న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు భేటీ కానున్నాయి.

  • Written By:
  • Updated On - May 30, 2024 / 12:58 PM IST

PM Candidate : జూన్ 1న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు భేటీ కానున్నాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్  సీనియర్ నేత జైరాం రమేశ్ గురువారం కీలక ప్రకటన చేశారు. మరో 48 గంటల్లో (జూన్ 1న) ఇండియా కూటమికి చెందిన ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటామని ఆయన వెల్లడించారు. ఇండియా కూటమిలో అత్యధిక సీట్లు సాధించే పార్టీయే ప్రధాని పదవికి సహజ హక్కు దారుగా నిలుస్తుందని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 లోక్‌సభ సీట్ల మెజారిటీని ఇండియా కూటమి అవలీలగా సాధిస్తుందని జైరాం రమేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే తాము ప్రధాన మంత్రి అభ్యర్థి (PM Candidate) ఎంపిక కోసం కసరత్తును మొదలుపెట్టామని ఆయన చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే.. ఎన్డీయే కూటమిలోని కొన్ని పార్టీలు కూడా ప్రభుత్వంలో చేరే ఛాన్స్ ఉందన్నారు. అయితే వారిని కూటమిలో చేర్చుకోవాలా ? వద్దా ? అనే దానిపై మిత్రపక్షాలన్నీ కలిసి నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు.

Also Read :Rajinikanth : హిమాలయాలకు బయలుదేరిన రజనీకాంత్‌.. ఆధ్యాత్మికతపై కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ఫలితాల తర్వాత జేడీయూ, టీడీపీ వంటి ఎన్డీయే మిత్రపక్షాలకు ప్రభుత్వంలో చోటు ఇస్తారా ? అని మీడియా ప్రతినిధి జైరాం రమేష్‌ను ప్రశ్నించగా..‘‘2019లో టీడీపీ, కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. ఆ విషయాన్ని మనం మరువకూడదు. కొన్ని ఎన్డీయే పార్టీలు సంకీర్ణంలో చేరే ఛాన్స్ తప్పకుండా ఉంది. అయితే దీనిపై కాంగ్రెస్  అగ్రనేతలు ఖర్గే, రాహుల్, సోనియా తుది నిర్ణయం తీసుకుంటారు’’ అని తెలిపారు.

Also Read : Congress Vs KCR : ‘‘ఈ పడిగాపుల పాపం నీది కాదా కేసీఆర్ ?’’.. కాంగ్రెస్ ట్వీట్

అత్యంత సంపన్న అభ్యర్థి

సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకుంది.  జూన్ 1న 57 లోక్‌సభ స్థానాల్లో తుది (ఏడో) విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 299 మంది కోటీశ్వరులే. రూ. 5 కోట్లకుపైగా ఆస్తి కలిగినవారు 111 మంది, రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల దాకా ఆస్తులున్న అభ్యర్థులు 84 మంది ఉన్నారు. ఈ విడతలో అత్యంత సంపన్న లోక్‌‌సభ అభ్యర్థిగా శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ నిలిచారు. ఆమెకు రూ. 198 కోట్ల ఆస్తి ఉంది. బీజేపీకి చెందిన వైజయంత్ పాండాకు రూ. 148 కోట్ల ఆస్తి, సంజరు టాండన్‌కు రూ. 111 కోట్ల ఆస్తి ఉంది. ఉత్కళ్ సమాజ్ పార్టీకి చెందిన భానుమతి దాస్‌కు కేవలం రూ. 1,500 ఆస్తి ఉంది.