INDIA : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ గెలుపు నేపథ్యంలో ఇండియా కూటమి అలర్ట్ అయింది. ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలతో డిసెంబర్ 6న సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతోంది. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఓ ప్రకటన విడుదల చేశారు.డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సహా కూటమిలోని పార్టీల ముఖ్యనేతలకు ఫోన్ చేసి సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన తెలియజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికలకు కీలకం కావడంతో.. ఈనెల 6న జరగబోయే ఇండియా కూటమి సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకుముందు ఇండియా కూటమి ముంబైలో సమావేశమైంది. విపక్ష కూటమిలోని పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాలని ఆ భేటీలో మూడు పాయింట్ల తీర్మానాన్ని ఆమోదించాయి.డిసెంబరు 6 మీటింగ్ తర్వాత ఎలాంటి నిర్ణయాలతో ఇండియా కూటమి ముందుకు సాగుతుందో వేచిచూడాలి.