జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో భారత నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (Vinay Narwal) ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆయన భార్య (Vinay Narwal Wife) హిమాన్షి భర్త మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు కోట్లాది హృదయాలను కదిలించింది. అయితే ఈ ఘటనను అవమానించేలా మధ్యప్రదేశ్‌కు చెందిన ఒసాఫ్ ఖాన్ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. “వినయ్‌ను చంపించేందుకు ఆయన భార్యే ఓ షూటర్‌ను నియమించి ఉండొచ్చు. ముందుగా ఆమెను విచారించాలి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరసనకు దారితీశాయి. దీంతో పోలీసులు అతడిని వెంటనే అరెస్ట్ చేశారు.
Oily Skin: వేసవికాలంలో చర్మం జిడ్డుగా కనిపిస్తోందా.. అయితే ఇవి ట్రై చేయాల్సిందే!
ఇదిలా ఉంటే వినయ్ నర్వాల్ పెళ్లయి కేవలం ఆరు రోజులు మాత్రమే అయింది. హనీమూన్ కోసం భార్య హిమాన్షితో కలిసి పహల్గాం వెళ్లిన సమయంలో ఊహించని విధంగా ఉగ్రదాడికి గురై ప్రాణాలు కోల్పోయాడు. తమ జీవితంలోని మధుర క్షణాలను మరింత మధురంగా గడుపుదామనుకున్న నూతన దంపతులకు ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. భర్త మృతదేహం వద్ద హిమాన్షి కూర్చొని కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యాలు ఇంటర్నెట్‌ను కదిలించాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ అమర జవాను కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ, ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
భారత నేవీలో రెండేళ్ల క్రితం చేరిన వినయ్ స్వస్థలం హర్యానాలోని కర్నాల్. తన భర్త త్యాగాన్ని వృధా కానివ్వమని హిమాన్షి, “నా భర్త గర్వపడేలా చేస్తాం” అంటూ సెల్యూట్ చేసి, కన్నీళ్లతో వీడ్కోలు పలికింది. ఈ ఘటన దేశమంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమాయక పౌరులపై దాడులు చేసే ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేశం ఈ గాయాన్ని మరచిపోదు, అమర జవాన్ల త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రతిఒక్కరూ స్పష్టం చేస్తున్నారు.