Site icon HashtagU Telugu

Suicide : దారుణం…కూతురు దళిత వ్యక్తితో వెళ్లిపోయిందన్న అవమానంతో కుటుంబం మొత్తం..!!

Sucide Imresizer

Sucide Imresizer

బెంగుళూరులో దారుణం జరిగింది. తమ కూతురు దళిత వ్యక్తితో పారిపోయిందని తెలిసి అవమానంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా షాకింగ్ కు గురిచేసింది. చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన కూతురు దళితుడితో పారియిందని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

మృతులు హండిగానాల గ్రామానికి చెందిన శ్రీరామప్ప (69), అతని భార్య సరోజ (55), మనోజ్ (25)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమ కూతురు కనిపించడంలేదని శ్రీరామప్ప సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత రోజు దళిత కులానికి చెందిన యువకుడితో పారిపోయిందని అనుమానంతో వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. కాగా ఆయువతి మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయి ఎక్కడ ఉన్నదన్న వివరాలను పోలీసులు వెల్లడించలేదు. తమ పెళ్లికి పెద్ద అంగీకరించకపోవడంతోనే ఇద్దరూ పారిపోయారని తెలిపారు.