Heatwave Alert: ఢిల్లీలో భానుడి ప్రతాపం..రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ

రాబోయే ఐదు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పేర్కొన్న రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ

Heatwave Alert: రాబోయే ఐదు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పేర్కొన్న రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేస్తూ, ఈ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ మార్కును అధిగమించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

వాయువ్య భారతదేశంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి. గత రెండు మూడు రోజులుగా ఈ ప్రాంతానికి రెడ్ అలర్ట్’ జారీ చేశామనిసీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త నరేష్ కుమార్ తెలిపారు.రాష్ట్రాల వారీగా అంచనాకు సంబంధించి రాబోయే ఐదు రోజుల పాటు రాజస్థాన్‌లో ‘రెడ్ అలర్ట్’ జారీ చేసాము. గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ నుండి మరింత పెరిగి 47 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

పంజాబ్ మరియు హర్యానాలో ప్రస్తుత గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అయితే అవి క్రమంగా రెండు నుండి మూడు డిగ్రీలు పెరుగుతాయి. దీని కోసం ఉత్తరప్రదేశ్‌లో ‘రెడ్ అలర్ట్’ జారీ చేసాము. రాబోయే ఐదు రోజుల పాటు మధ్యప్రదేశ్‌లోని ఉత్తర ప్రాంతాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించామని ఆయన అన్నారు.

వాతావరణ కార్యాలయం ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లోని దిగువ కొండలలో విపరీతమైన వేడి కొనసాగుతుంది. మంగళవారం, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అధిక వేడి కారణంగా గృహాలు మరియు కార్యాలయాలు ఎయిర్ కండీషనర్ల వినియోగాన్ని పెంచడంతో ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ మంగళవారం మధ్యాహ్నం 7,717 మెగావాట్ల గరిష్ట స్థాయికి చేరుకుందని అధికారులు తెలిపారు. మరోవైపు రానున్న రెండు మూడు రోజుల్లో తమిళనాడు, కేరళలో 12 సెంటీమీటర్ల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read: Delhi Metro Graffiti: కేజ్రీవాల్ ను చంపేస్తానని మెట్రో స్టేషన్లో రాతలు.. వ్యక్తి అరెస్ట్