24 Hours Strike: పశ్చిమబెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఒకరోజు వైద్య సేవల్ని నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఈనెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవల్ని నిలిపివేయాలని (24 Hours Strike) నిర్ణయించినట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు డాక్టర్ జయచంద్ర నాయుడు, డాక్టర్ ఫణిధర్ తెలిపారు. అత్యవసర వైద్య సేవలు కొనసాగింపుకు మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు.
మృతిచెందిన డాక్టర్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, డాక్టర్లపై హింసకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాన్ని కేంద్రం పకడ్బంధీగా అమలు చేయాలని, ఆసుపత్రుల్ని సేఫ్ జోన్లుగా ప్రకటించాలన్న డిమాండ్లతో తాము ఒక్క రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వైద్యవృత్తి పేట్రేగుతున్న హింస, దాడుల్ని అరికట్టేందుకు వైద్యులు అందరూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు. వైద్య వృత్తి స్వభావం కారణంగా వైద్యులు ముఖ్యంగా మహిళలు హింసకు గురవుతున్నారని.. అలాంటి డాక్టర్లకు ఆస్పత్రులు, క్యాంపస్‌ల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.
Also Read: Congress vs BRS : అగ్గిపెట్టె హరీష్‌రావు అంటూ నగరంలో భారీగా ప్లెక్సీ లు..
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగస్టు 17న దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. కోల్‌కతాలో మహిళా డాక్టర్ హత్యపై ఐఎంఏ సమ్మెకు దిగనుంది. ఆసుపత్రులను సేఫ్ జోన్‌లుగా ప్రకటించడంతో పాటు కేంద్ర రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఐఎంఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో బుధవారం రాత్రి జరిగిన హింసకు వ్యతిరేకంగా ఐఎంఎ కూడా నిరసన తెలుపుతుంది. అన్ని సేవలు 17.08.2024 శనివారం ఉదయం 6 గంటల నుండి 18.08.2024 ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు మూసివేయబడతాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలోని రెసిడెంట్ వైద్యులు ఆసుపత్రి యంత్రాంగం సాక్ష్యాలను తారుమారు చేస్తోందని ఆరోపించారు. సెమినార్ హాల్ ధ్వంసం చేశారు. ఇంతకు ముందు కూడా FORDA (ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్) సమ్మెకు పిలుపునిచ్చిందని, దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో కనిపించిందని, అయితే బుధవారం రాత్రి RGKar హాస్పిటల్‌లో జరిగిన హింస, విధ్వంసం కారణంగా FORDA మళ్లీ సమ్మె చేయాలని నిర్ణయించింది. పని సమయంలో ఆరోగ్య కార్యకర్తల భద్రతను ప్రభుత్వం నిర్ధారించలేకపోతుందని FORDA పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.