India Vs Pak : జమ్మూకశ్మీర్ ఎప్పటికీ తమ దేశంలో అంతర్భాగమని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఆవిషయంలో పాకిస్తాన్ అనవసర ప్రస్తావన తీసుకొస్తోందని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు. పాక్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి సయ్యద్ తారిఖ్ ఫతేమీ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్(India Vs Pak) అంశాన్ని ఆయన లేవనెత్తారు. దీన్ని పర్వతనేని హరీశ్ తీవ్రంగా ఖండించారు. పాక్ ఆరోపణలను ఆయన ఖండించారు. పాకిస్తాన్ ఐరాస వేదికగా అనవసర అంశాలను లాగుతోందని ఫైర్ అయ్యారు.
Also Read :Kokapet Lands : కోకాపేటలో బంగారు భూములు.. ఎందుకు ?
ఇస్లామో ఫోబియా వ్యతిరేక సదస్సులో..
ఈనెల ప్రారంభంలో జరిగిన ఇస్లామో ఫోబియా వ్యతిరేక సదస్సులో పాకిస్తాన్ మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి తెహ్మీనా జంజువా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ పాకిస్తాన్‌దే అనే కోణంలో ఈ కామెంట్స్ ఉన్నాయి. దీనికి స్పందనగా ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో భారత్ బలమైన కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలు సైతం భారత్‌పై పలు ఆరోపణలు చేశారు. బెలూచిస్తాన్ ట్రైన్ హైజాక్ ఘటనలో భారత్ హస్తం ఉందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భారత్ బలంగా ఖండించింది.
Also Read :Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు ఔట్.. ఆరుగురు ఇన్ ?
పాక్‌కు భారత్ హితవు
‘‘పాకిస్తాన్ ఆరోపణలకు ఆధారాలు లేవు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రం ఏ దేశంలో ఉందో అందరికీ తెలుసు. పాకిస్తాన్ తమ దేశంలోని అంతర్గత పరిస్థితులపై, సొంత విధానాలపై సమీక్షించుకోవాలి. పాక్‌లో(India Vs Pak) జరిగే ఘటనలతో సంబంధాన్ని ఇతర దేశాలపై రుద్ద కూడదు’’ అని భారత విదేశాంగ శాఖ సూచించింది. ‘‘ఇతర దేశాలపై ఆరోపణలు చేయడం మానేసి.. దేశంలోని పరిస్థితులను చక్కదిద్దడంపై పాకిస్తాన్ ప్రభుత్వం ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది’’ అని భారత్ హితవు పలికింది.