Site icon HashtagU Telugu

Igla S Missiles: టార్గెట్ పీఓకే.. ‘ఇగ్లా-ఎస్‌’లను రంగంలోకి దింపుతున్న భారత్

Igla S Missiles India Russia Pakistan India Vs Pakistan

Igla S Missiles: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ భారత్‌ చేతికి మరో అస్త్రం అందింది. అదే.. ‘‘ఇగ్లా-ఎస్‌’’. ఇది స్వల్ప శ్రేణి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ.  దీన్ని మిలిటరీ ట్రక్కులో ఏ ప్రదేశానికైనా తీసుకెళ్లి మోహరించొచ్చు. ‘‘ఇగ్లా-ఎస్‌’’ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని మిస్సైళ్లు  11వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లగలవు. ఇవి గరిష్ఠంగా 6 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల లక్ష్యాలను తాకగలవు. మాక్ 1.9 స్పీడుతో ఈ మిస్సైళ్లు ప్రయాణిస్తాయి. 1 మాక్ స్పీడ్ అంటే గంటకు 1234 కిలోమీటర్లు.  అంటే దీన్ని స్పీడు ఎంతలా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు. ‘‘ఇగ్లా-ఎస్‌’’ మిస్సైళ్లకు(Igla S Missiles) లేజర్‌బీమ్‌ రైడింగ్‌ సామర్థ్యం కూడా ఉంది. అందుకే వీటిని పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, యూఏవీలను కూల్చడానికి ప్రయోగించనున్నారు. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన  ఇంటిగ్రేటెడ్‌ డ్రోన్‌ డిటెక్షన్‌ అండ్‌ ఇంటర్‌డిక్షన్‌ సిస్టమ్‌ను కూడా డ్రోన్లు, యూఏవీలను కూల్చేందుకు వాడనున్నారు.

పీఓకేపై గురిపెట్టేందుకే.. 

ఇగ్లా క్షిపణులతో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కూడా ధ్వంసం చేయొచ్చు. సైనికులు భుజంపై నుంచి కూడా ఇగ్లా – ఎస్ మిస్సైళ్లను ప్రయోగించొచ్చు.  గగన తలంలోని లక్ష్యాలను గురిపెట్టి వీటిని వదలొచ్చు. ఈ మిస్సైళ్లు సరిహద్దుల్లోని పాకిస్తాన్ సైన్యానికి నిద్ర లేకుండా చేయడానికి ఉపయోగపడనున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)పై భారత్ ప్రధాన గురి పెట్టింది. అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇగ్లా -ఎస్ మిస్సైళ్లను భారత్ వినియోగించే అవకాశం ఉంది.

Also Read :Fact Check: మోడీ చెప్తే.. పాకిస్తాన్ లేకుండా చేస్తానన్న ఇటలీ ప్రధాని

భారత్ దాదాపు రూ.260 కోట్లతో రష్యా నుంచి ‘‘ఇగ్లా-ఎస్‌’’ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కొనుగోలుకు చేయనుంది. 48 ఇగ్లా-ఎస్ లాంఛర్లు, 90 ఇగ్లా-ఎస్‌ క్షిపణుల కోసం భారత సైన్యం టెండర్‌ విడుదల చేసింది. వీటిని ఫాస్ట్‌ట్రాక్ ప్రొక్యూర్‌మెంట్‌ కింద కొనబోతున్నారు. ఇప్పటికే కొంత స్టాక్ భారత్‌కు చేరింది. మిగతాది త్వరలోనే భారత్‌కు అందుతుంది. వీటిని భారతదేశ పశ్చిమ సెక్టార్‌లోని సరిహద్దుల్లో అంటే పాక్ ఆక్రమిత కశ్మీరు వైపు మోహరిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే  భారత వాయుసేన వద్ద ఇగ్లా-ఎస్ మిస్సైల్ వ్యవస్థలు ఉన్నాయి.  1990వ దశకం నుంచే ఇగ్లా-ఎస్‌ను భారత్‌ సైన్యం వినియోగిస్తోంది. మన దేశంలోని కొన్ని సంస్థలు స్వదేశీ టెక్నాలజీతో ఇగ్లా-ఎస్‌ వర్షన్‌‌ను తయారు చేస్తున్నాయి.

Also Read :Spacecraft Crash : భూమిపైకి ‘కాస్మోస్ 482’.. భారత్‌లో పడుతుందా ?