Site icon HashtagU Telugu

Rahul Gandhi: అధికారంలోకి వస్తే.. రైతుల కనీస మద్దతు ధరకు ప్రత్యేక చట్టాన్ని తెస్తాంః రాహుల్

If We Come To Power, We Wil

If We Come To Power, We Wil

 

Rahul Gandhi: భారత్‌జోడో న్యాయ్‌ యాత్ర(Bharatjodo Nyay Yatra)లో భాగంగా రాజస్థాన్‌(Rajasthan) బన్‌స్వారా(Banswara)లోని నిర్వహించిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ..కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఉద్యోగ కల్పన కోసం యువతకు అప్రెంటీస్‌షిప్‌లు కల్పిస్తామని రాహుల్‌ వాగ్దానం చేశారు.

సంవత్సర అప్రెంటీస్‌షిప్‌ సమయంలో ఒక్కొక్కరికి రూ.లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు రాహుల్. ఉద్యోగ నియామకాల కోసం జరిగే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని, అంకుర సంస్థలకు రూ.5 వేల కోట్ల నిధులు ఇస్తామని రాహుల్‌ వివరించారు.

We’re now on WhatsApp. Click to Join.

పంటలకు కనీస మద్దతు ధర హామీని కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టోలో చేర్చినట్లు వెల్లడించారు. ‘భారత్‌లో తొలిసారి అన్నదాతల కోసం పంటలకు మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీని మా మేనిఫెస్టోలో చేర్చాం. అంటే ఎమ్​ఎస్​పీ కోసం చట్టం తీసుకురావాలని నిర్ణయించాం’ అని రాహుల్​ చెప్పారు.

“దేశ జనాభాలో 90 శాతం దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలే ఉన్నారని, కానీ వివిధ సంస్థలను చూడండి. దేశ బడ్జెట్‌ను చూడండి. ఈ వర్గాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా కనిపించదు” అని రాహుల్​ బీజేపీపై మండిపడ్డారు.

read also :Upasana : మా అత్తమ్మే నాకు స్ఫూర్తి – ఉపాసన 

“మన రాష్ట్రపతి ఒక ఆదివాసి. రామమందిర ప్రారంభోత్సవం జరిగింది. మీరు టీవీల్లో ఆమెను చూశారా? లేదు! ఎందుకంటే ఆమె ఆదివాసి మహిళ కాబట్టి. ఆదివాసి కాబట్టి రాష్ట్రపతి అయినా సరే రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దు అని ఆమెకు నేరుగా సందేశం పంపించారు.”