MK Stalin : స్టాలిన్ ప్రభుత్వం ముందు నుంచే కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ విషయంపై సీఎం స్టాలిన్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలన్నారు. హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేయాలని డిమాండ్ చేశారు. తమిళంపై ప్రేమ ఉంటే.. చేతల్లో చూపించాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తిరుక్కురల్‌ను ఉటంకిస్తే సరిపోదు. రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు, సత్వర విపత్తు సహాయ నిధి, కొత్త రైల్వే ప్రాజెక్టులను అందించాలి. రైళ్లకు అంత్యోదయ, తేజస్, వందేభారత్ వంటి పేర్లు పెట్టడం ఆపండి. దానికి బదులు తమిళ పేర్లను పెట్టండి. తమిళ భాషపై ప్రేమను మాటల్లో కాకుండా.. చేతల్లో చూపించండి అని స్టాలిన్ పేర్కొన్నారు.
Read Also: Janasena : ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
ప్రధాని మోడీకి తమిళం అంటే అపారమైన ప్రేమ అని బీజేపీ చెబుతోంది. అదే నిజమైతే.. దాన్ని ఆయన చేతల్లో ఎందుకు చూపించడం లేదు..?. పార్లమెంటులో సెంగోల్‌ను ఏర్పాటు చేయడం కంటే.. రాష్ట్రం లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగిస్తే బాగుంటుంది. హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేసి.. మరిన్ని నిధులు కేటాయించండి. అంతేకాదు, రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాల్లో సంస్కృతం వాడకాన్ని ఆపాలి. రైళ్లకు అంత్యోదయ, తేజస్, వందేభారత్ వంటి పేర్లు పెట్టడం ఆపండి. దానికి బదులు చెమ్మోళి, ముత్తునగర్, వైగై, మలైకొట్టై, తిరుక్కురల్ ఎక్స్‌ప్రెస్ మొదలైన వాటిలాగా తమిళ పేర్లను పెట్టండి. తమిళ భాషపై ప్రేమను మాటల్లో కాకుండా.. చేతల్లో చూపించండి అని స్టాలిన్ పేర్కొన్నారు.
కానీ, గత 50 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన తమకు ఇది శిక్ష కాకూడదన్నారు. ఈ సందర్భంగా 2026 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ చేపట్టరాదని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. 1971 జనాభాల లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోదీని స్టాలిన్ అభ్యర్థించారు. ప్రస్తుత జనాభా ప్రకారం.. పార్లమెంటులో తాము 12 సీట్లు కోల్పోయి.. 10 సీట్లు మాత్రమే వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది తమిళ రాజకీయాలపై ప్రత్యక్షంగా దాడి చేయడమేనన్నారు. ఈ చర్య రాష్ట్ర గొంతును నొక్కేస్తుందన్నారు. తాము విభజనకు వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.