4455 Jobs : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జాబ్స్ కోరుకునే వారికి మంచి అవకాశం. 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల(4455 Jobs) భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసిన నోటిఫికేషన్ గడువు ముగియవస్తోంది. అప్లై చేయడానికి ఇంకా నాలుగు రోజుల టైమే ఉంది. ఆగస్టు 28లోగా అర్హులైన అభ్యర్థులంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు. 2024 ఆగస్టు 1 నాటికి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగినవారు దరఖాస్తు చేయొచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీలు, ఎస్సీలు రూ.175 అప్లికేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారికి సెప్టెంబరు నెలలో ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష కాల్‌లెటర్‌ను అక్టోబర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే నెలలో ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్‌లో విడుదలవుతాయి. మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెటర్‌ను నవంబరులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఎగ్జామ్ నవంబర్‌లో ఉంటుంది. దాని ఫలితాలు ఈ ఏడాది డిసెంబర్ లేదా 2025 జనవరిలో విడుదలవుతాయి. చివరగా ఇంటర్వ్యూలు జనవరి లేదా ఫిబ్రవరిలో జరుగుతాయి. ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ తర్వాత తుది నియామకాలు ఏప్రిల్‌లో జరుగుతాయి.తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌లలో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
Also Read :Nagarjuna : షాకిచ్చిన హైడ్రా.. హీరో నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత
- ప్రిలిమ్స్ రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కుల ఈ పరీక్షను 60 నిమిషాల్లో రాయాలి. ఇంగ్లీష్/ హిందీ మీడియంలలో ప్రశ్న పత్రం ఉంటుంది.
- మెయిన్ ఎగ్జామినేషన్‌లో ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 ప్రశ్నలకు 60 మార్కులు ఇస్తారు. జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 ప్రశ్నలకు 40 మార్కులు, డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ నుంచి 35 ప్రశ్నలకు 60 మార్కులు ఇస్తారు. 200 మార్కుల ఈ పరీక్షను 3 గంటలలో రాయాలి. ఈ పరీక్ష కూడా ఇంగ్లీష్/హిందీ మీడియంలలో జరుగుతుంది.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్షలో లెటర్ రైటింగ్ , ఎస్సేలు అడుగుతారు. ఈ 2 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. 30 నిమిషాల్లోనే ఈ ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.