Agniveer Recruitment 2025 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌‌లో ‘అగ్నివీర్ వాయు’ జాబ్స్

'అగ్నివీర్ వాయు' రిక్రూట్‌మెంట్‌(Agniveer Recruitment 2025)లో భాగంగా రెండో దశలో ఫిజికల్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2 జరుగుతాయి.

Published By: HashtagU Telugu Desk
Agniveer Vayu Recruitment Iaf Agniveer Jobs Recruitment 2025

Agniveer Recruitment 2025 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (ఐఏఎఫ్)లో చేరాలని చాలామంది యువతకు ఉంటుంది. అలాంటి వారికి ఇది మంచి అవకాశం. ‘అగ్నివీర్ వాయు’ పోస్టులకు జనవరి 7 నుంచి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి లాస్ట్ డేట్ జనవరి 27. అప్లికేషన్ ఫీజు రూ.550 మాత్రమే. కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ పాసైన వారు అప్లై చేయొచ్చు. ఇంజినీరింగ్ డిప్లొమా చేసినవారు సైతం దరఖాస్తులను సమర్పించొచ్చు.

Also Read :Migrations to Hyderabad : హైదరాబాద్‌కు వలసల సునామీ.. ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు

అయితే అభ్యర్థులకు తప్పకుండా దేహ దారుఢ్యం ఉండాలి.  పురుష అభ్యర్థులకు కనీస ఎత్తు 152 సెం.మీ, మహిళా అభ్యర్థులకు కనీస ఎత్తు 152 సెం.మీ. ఉండాలి. 2005 సంవత్సరం జనవరి 7 నుంచి 2008 సంవత్సరం జులై 1 మధ్య జన్మించినవారు మాత్రమే అప్లై చేయాలి. ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేయాలి. అర్హులైన అభ్యర్థులకు తొలుత ఆన్‌లైన్ రాతపరీక్షను నిర్వహిస్తారు. మార్చి 22 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభమవుతాయి. పరీక్షలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.  ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు చొప్పున తగ్గిస్తారు. హాల్‌టికెట్లను పరీక్షకు రెండు, మూడురోజుల ముందే విడుదల చేస్తారు.

Also Read :Students Threat Emails : ఆ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపింది విద్యార్థులే!

‘అగ్నివీర్ వాయు’ రిక్రూట్‌మెంట్‌(Agniveer Recruitment 2025)లో భాగంగా రెండో దశలో ఫిజికల్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2 జరుగుతాయి. మూడోదశలో మెడికల్ టెస్టు, ధ్రువపత్రాల పరిశీలన జరుగుతాయి. ఇవన్నీ పూర్తయ్యాక అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  తుది ఫలితాలు 2025 సంవత్సరం నవంబరు 14కల్లా వచ్చే అవకాశం ఉంది. అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఎంపికయ్యే వారికి మొదటి ఏడాదిలో ప్రతినెలా రూ.30,000 చెల్లిస్తారు.  రెండో ఏడాదిలో ప్రతినెలా రూ.33,000 శాలరీ ఉంటుంది. మూడో ఏడాదిలో ప్రతినెలా రూ.36,000 శాలరీ, నాలుగో ఏడాదిలో ప్రతినెలా రూ.40,000 శాలరీ లభిస్తుంది. నాలుగు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేవారికి ‘సేవానిధి ప్యాకేజీ’ కింద రూ.10.04 లక్షలు చెల్లిస్తారు.

  Last Updated: 22 Dec 2024, 01:50 PM IST