Annamalai : తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి రేసు నుంచి తాను తప్పుకున్నట్లు కే. అన్నామలై ప్రకటించారు. ఈ పోటీలో తానుగా పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. కోయంబత్తూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు బీజేపీలో నాయకత్వం కోసం నేతలు పోటీ పడరు. మేమంతా ఏకగ్రీవంగా నాయకుడిని ఎన్నుకుంటాం. కానీ, నేను కూడా ఈ రేసులో లేను అని వ్యాఖ్యానించారు. తన రాజీనామా నేపథ్యంలో తమిళనాడు బీజేపీలో కొత్త నాయకత్వం ఎవరవుతారన్న ప్రశ్న వేడెక్కుతోంది.
Read Also: Donald Trump Tariffs : ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చినా చైనా
ఇతర పార్టీల మాదిరిగా బీజేపీలో అధ్యక్ష పదవి కోసం 50 మంది నేతలు నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. పార్టీకి ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటున్నా. ఈ పార్టీ ప్రగతి కోసం ఎంతో మంది తమ ప్రాణాలర్పించారు. ఎప్పటికీ పార్టీ బాగుండాలని పరితపించే వ్యక్తిని నేను అన్నారు. ఎలాంటి రాజకీయ ఊహాగానాలపైనా స్పందించబోనన్న అన్నామలై.. తాను ఏ రేసులోనూ లేనన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గురించి ఈ నెల 9న ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో అన్నామలై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరోవైపు, అన్నామలై ఈ నెల 7న ఢిల్లీకి వెళ్తారని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. కాగా, పలు రాష్ట్రాల్లో నూతన అధ్యక్షుల నియామకంపై బీజేపీ అధిష్ఠానం ముమ్మర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా, బీజేపీకి కొత్త నాయకత్వం అవసరమని భావిస్తున్నట్లు సమాచారం. అన్నామలై అధ్యక్షుడిగా ఉంటే పొత్తు కొనసాగించడం కష్టమని అన్నాడీఎంకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
Read Also: Ram Charan : ‘పెద్ది’ డైరెక్టర్ చరణ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?