Site icon HashtagU Telugu

CJI Chandrachud : ‘యా’ అనొద్దు.. ఇది కాఫీ షాపు కాదు.. లాయర్‌పై సీజేఐ ఆగ్రహం

Cji Chandrachud Rap To Lawyer Supreme Court

CJI Chandrachud : సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు న్యాయవాది వాదనలు వినిపించే క్రమంలో పదేపదే ‘యా’ (yeah) అంటుండటంపై సీజేఐ విస్మయం వ్యక్తం చేశారు. ‘యా’ అనేది  గౌరవప్రదమైన పదం కాదని ఆ న్యాయవాదికి సీజేఐ సూచించారు. ‘‘మీరు కేఫ్‌లో లేరు.. కోర్టు రూంలో ఉన్నారు.. పదాలను జాగ్రత్తగా వాడండి.. యా అనే పదం అంటే నాకు, మా న్యాయమూర్తుల బెంచ్‌కు అలర్జీ. అలాంటి పదాలు వాడేందుకు మిమ్మల్ని మేం అనుమతించం’’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.

Also Read :Dadasaheb Phalke Award : మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. అక్టోబరు 8న ప్రదానం

ఏమిటా కేసు ?

సదరు లాయర్ 2018లో సుప్రీంకోర్టులో దాఖలైన ఓ రివ్యూ పిటిషన్‌పై వాదనలు వినిపించడం మొదలుపెట్టారు. ఆ పిటిషన్ మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 32తో ముడిపడినది. భారత పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగినప్పుడు, వారికి రాజ్యాంగ పరిహారపు హక్కును కల్పించడమే ఆర్టికల్ 32 ప్రత్యేకత. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ను(CJI Chandrachud) కూడా పిటిషనర్ చేర్చారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి స్థాయి వ్యక్తి పేరును పిటిషన్‌లో ఎలా చేర్చారని ప్రశ్నించారు. వెంటనే ఆ పేరును పిటిషన్ నుంచి తొలగించాలని కోర్టు రిజిస్ట్రీని సీజేఐ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. ఈక్రమంలో మరోసారి లాయర్ స్పందిస్తూ.. ‘‘గతంలో ఇదే పిటిషన్‌ను నాటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ డిస్మిస్ చేశారు. నా క్లయింట్ పిటిషన్‌లో తప్పు లేనప్పుడు ఎందుకలా డిస్మిస్ చేశారు ?  దీంతో  మేం  తదుపరి సీజేఐ ఠాకూర్ ధర్మాసనం ఎదుట  రివ్యూ పిటిషన్ వేశాం. దాన్ని కూడా డిస్మిస్ చేశారు. ఇప్పుడు మేం వేసిన పిటిషన్‌లో అందుకే గొగోయ్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాం’’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ.. ఈ పిటిషన్‌తో మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌కు సంబంధం లేదని, ఆయన పేరును పిటిషన్‌ను తొలగించాలని ఆదేశించారు.

Also Read :Fake Currency : నటుడు అనుపమ్ ఖేర్ ఫొటోతో రూ.1.30 కోట్ల ఫేక్ కరెన్సీ.. బంగారం వ్యాపారికి కుచ్చుటోపీ