Ajit Pawar : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ సంచలన కామెంట్స్ చేశారు. అందరిలాగే తనకు కూడా సీఎం కావాలని ఉందని ఆయన చెప్పారు. దగ్డూషేఠ్ హల్ద్వాయ్ గణపతి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అజిత్ పవార్ ఈ కామెంట్స్ చేశారు.
Also Read :Air India : రూ.3వేల కోట్లతో 67 ఎయిర్ ఇండియా పాత విమానాల అప్‌గ్రేడ్
‘‘ప్రతీ రాజకీయ పార్టీ క్యాడర్ ఆ పార్టీ నేత సీఎం కావాలని కోరుకుంటుంది. అలాగే మా పార్టీ (ఎన్సీపీ) క్యాడర్ కూడా నేను సీఎం కావాలని ఆశిస్తోంది. అయితే సీఎం కావాలంటే మ్యాజిక్ ఫిగర్‌ను సాధించాల్సి ఉంటుంది. అందుకే అనుకున్న వాళ్లంతా సీఎం కాలేరు. ఎవరు సీఎం కావాలనేది ఓటర్లే నిర్ణయిస్తారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లకుగానూ 145 గెలిచే వాళ్లే సీఎం పదవిని నిర్ణయించగలుగుతారు’’ అని అజిత్ పవార్(Ajit Pawar) పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, ఎన్సీపీ, శివసేన కూటమి కలిసికట్టుగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సీఎం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో తాము ఎన్నికలకు వెళ్తామన్నారు.
Also Read :Bajaj New Motorcycles : బజాజ్ నుంచి రెండు కొత్త 400 సీసీ బైక్స్.. ఫీచర్లు ఇవే
‘‘ఎన్నికలకు ముందు మేం సీఎం సీటు గురించి చర్చించదల్చలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాాతే దాని గురించి కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం’’ అని అజిత్ పవార్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ పోల్స్ తర్వాత మళ్లీ ఏక్‌నాథ్ షిండేను సీఎం చేయాలని శివసేన క్యాడర్ కోరుతుండగా, దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేయాలని బీజేపీ క్యాడర్ కోరుతోంది. ఈనేపథ్యంలోనే తాను కూడా సీఎం పదవిని ఆశిస్తున్నానని స్వయంగా అజిత్ పవార్ వెల్లడించారు. సీఎం సీటుకు జరిగే పోటీలో తాను కూడా ఉంటానని పరోక్షంగా అల్టిమేటం ఇచ్చారు. ఇటీవల కాలంలో శరద్ పవార్‌కు అనుకూలంగా అజిత్ పవార్ పలు వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల టైంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై తన భార్య సునేత్రా పవార్‌ను పోటీకి నిలిపి తప్పుచేశానని అజిత్ అంగీకరించారు.