Congress vs Regional Parties : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే విపక్ష ఇండియా కూటమిలో పెద్దగా ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు ఏదో జరుగుతోంది ? ఆ కూటమిలోని పలు పార్టీల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు పెరిగిపోయాయి. ప్రధానంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కాలి అనే దానిపైనా విపక్ష పార్టీల్లో ఒక్కో దానికి ఒక్కో విధమైన అభిప్రాయం ఉంది. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ ఓ వైపు.. కాంగ్రెస్ మరో వైపు ఉండి తలపడబోతున్నాయి. ఈ పరిణామాలు రానున్న కాలంలో ఇండియా కూటమిని చీల్చే అవకాశం లేకపోలేదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు అనే కోణంలో చూడాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.
Also Read :2 Lakh Job Cuts : ఏఐ హారర్.. 2 లక్షల బ్యాంకింగ్ ఉద్యోగాలు ఉఫ్.. ‘బ్లూమ్‌బర్గ్’ సంచలన నివేదిక
కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాలలో మునుపటి కంటే బలహీనంగా ఉంది. ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా(Congress vs Regional Parties) ముందు కాంగ్రెస్ నిలువలేకపోతోంది. ఆయా చోట్ల మిత్రపక్షాల మద్దతుతోనే బరిలో నిలవాల్సిన పరిస్థితిలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది. అందువల్ల ఇండియా కూటమి పగ్గాలు కాంగ్రెస్ చేతిలో ఉండటాన్ని కొన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ బాధ్యతలు మరేదైనా పార్టీకి అప్పగించాలని కోరుతున్నాయి. మమతా బెనర్జీకి ఇండియా కూటమి పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్‌కు చాలా విపక్ష పార్టీలు మద్దతును ప్రకటించడం కాంగ్రెస్‌కు పెద్ద మైనస్ పాయింట్. అత్యధిక లోక్‌సభ స్థానాలను కలిగిన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ కంటే దాని మిత్రపక్షాలే బలంగా ఉన్నాయి. వాటి దన్నుతోనే ఇప్పటిదాకా ఇండియా కూటమి నిలిచింది. అందుకే ఆయా రాష్ట్రాలకు చెందిన ఏదైనా పార్టీకి ఇండియా కూటమిని లీడ్ చేసే బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.
Also Read :Fact Check : 823 ఏళ్ల తర్వాత అరుదైన ఫిబ్రవరి 2025లో వస్తోంది.. నిజమేనా ?
ఇండియా కూటమిలో మొత్తం తప్పు కాంగ్రెస్ పార్టీదే అని చెప్పలేం. ఆమ్ ఆద్మీ పార్టీ బాగా దూకుడుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించేందుకు అస్సలు వెనుకాడటం లేదు. ప్రతీచోటా ఒంటరిగానే పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీలోని స్వార్థ భావనను స్పష్టంగా బయటపెడుతోంది. తమ పార్టీ బలహీనంగా ఉన్నచోట మాత్రమే మిత్రపక్షాలతో పొత్తులు కుదుర్చుకుంటామని కేజ్రీవాల్ అంటున్నారు. పార్టీ బలంగా ఉన్నచోట ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెబుతున్నారు. ఇలాంటి వైఖరి కలిగిన పార్టీలు ఇండియా కూటమికి అవసరమా ? నిస్వార్థంగా దేశ రాజకీయాల్లో మార్పులు తేవాలని భావించే పార్టీలు ఇండియా కూటమికి సరిపోతాయి. గోడ మీద పిల్లిలా ఈవిధమైన వైఖరిని కలిగి ఉండే పార్టీల అంశాన్ని ఇండియా కూటమి సమీక్షించుకుంటే ప్రయోజనం దక్కుతుంది.