Pakistan Vs IndiGo : అది ఇండిగో 6ఇ 2142 విమానం. బుధవారం రోజు ఢిల్లీ నుంచి జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌కు బయలుదేరింది. అకస్మాత్తుగా మార్గం మధ్యలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వద్ద ఉరుములు, మెరుపులతో కూడిన కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో విమానంలో ప్రయాణికులు హడలిపోయారు. ఆ పరిస్థితుల్లో విమానం ముందుకు సాగితే.. ప్రయాణికుల ప్రాణాలకే గండం. కాస్తంత దారి మార్చి పక్కకు వెళ్దామంటే.. పాకిస్తాన్ గగనతలం ఉంది. ప్రస్తుతం భారత్ కోసం పాకిస్తాన్(Pakistan Vs IndiGo) తన గగనతలాన్ని మూసేసింది. అయినా ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోకి కాసేపు తీసుకెళ్లడానికి పైలట్లు ట్రై చేశారు.
Also Read :Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కనికరం చూపని పాకిస్తాన్
అయితే పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగం అధికారులు కనికరం చూపలేదు. నో చెప్పారు. దీంతో పైలట్లు విమానాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారత గగనతలంలోని కారుమబ్బుల్లోకి తీసుకెళ్లారు. విమానం నిమిషానికి 8,500 అడుగుల వేగంతో కిందకి దిగడం మొదలైంది. సాధారణంగానైతే ఆ వేగం 1,500 నుంచి 3వేల అడుగుల మధ్యే ఉంటుంది. మరోవైపు వడగళ్లు బలంగా విమానాన్ని తాకసాగాయి. విమానం భారీ కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు వణికిపోయారు. హాహాకారాలు మొదలుపెట్టారు. అయినా పైలట్లు ధైర్యం కోల్పోలేదు. చాకచక్యంగా విమానాన్ని పూర్తి కంట్రోల్‌తో నడిపి శ్రీనగర్ రన్‌వేపై దించారు.
Also Read :Kavitha vs KCR : ‘కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ‘ ఉన్నాయి – కవిత
భారత వాయుసేన సాయం చేయడంతో..
ఈ కల్లోలం తీవ్రతకు విమానం ముందు భాగంలో ఉండే రాడోమ్ దెబ్బతింది. ఇందులో వాతావరణ రాడార్ ఉంటుంది. మొత్తం మీద విమానంలోని 227 మంది ప్రయాణికుల ప్రాణాలను పైలట్లు కాపాడారు. ఈ ఘటన వివరాలను తాజాగా భారత పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) మీడియాకు విడుదల చేసింది. లాహోర్ ఏటీసీ నిరాకరించినప్పటి నుంచి ఇండిగో విమానం శ్రీనగర్‌లో సురక్షితంగా దిగేవరకూ తాము తోడ్పాటు అందించామని భారత వాయుసేన వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.