Pollution Battle : మన దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం గజగజా వణికిస్తోంది. ఈ కాలుష్యం వల్ల ఏటా ఢిల్లీలో దాదాపు 12వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. మంగళవారం రోజు (నవంబరు 19న ) భారత రాజధానిలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 750 పాయింట్లకు పెరిగిపోయింది. ఈ పాయింట్లు ఎంతగా పెరిగితే గాలి నాణ్యత అంతగా తగ్గినట్టుగా పరిగణిస్తారు. మరోవైపు మన పొరుగుదేశం చైనా రాజధాని బీజింగ్‌లో నవంబరు 19న ఏక్యూఐ కేవలం 137 పాయింట్లుగా ఉంది. అంటే.. మన కంటే చాలా బెటర్‌గా అక్కడ గాలి నాణ్యత ఉంది. ఇంతకీ ఎందుకిలా ? గాలి నాణ్యత కంట్రోల్‌లో ఉండేలా చైనా(Pollution Battle) ఏం చేస్తోంది ? ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read : Non Hindu Employees : తిరుమలలో హిందూయేతర ఉద్యోగులు.. ఏపీ సర్కారు ఏం చేయబోతోంది ?
కాలుష్యం కట్టడికి చైనా ఏం చేస్తోంది ?
- ప్రపంచంలోనే అత్యధిక గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తున్న దేశం చైనా. గ్రీన్ హౌస్ వాయువులు ప్రమాదకరమైనవి. పరిశ్రమలు, వాహనాల నుంచి ఇవి విడుదల అవుతుంటాయి.
- ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల్లో దాదాుప 30 శాతం ఒక్క చైనాలోనే వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి.
- అయినా గాలి నాణ్యత తగ్గిపోకుండా చర్యలను అమలు చేయడంలో చైనా చాలా వరకు సక్సెస్ అయింది. అందుకే మన ఢిల్లీతో పోల్చుకుంటే బీజింగ్‌లో గాలి నాణ్యత చాలా బెటర్‌గా ఉంది.
- ఏటా ఢిల్లీలో ప్రత్యేకించి అక్టోబరు, నవంబరు నెలల్లోనే వాయు కాలుష్యం తీవ్రరూపు దాలుస్తోంది. ఆ టైంలోనే ఢిల్లీ శివార్లలో రైతులు పెద్దఎత్తున పంటల వ్యర్థాలను దహనం చేస్తున్నారు. దీపావళి అదే టైంలో వస్తోంది. చలికాలం కూడా ఆ నెలల్లోనే మొదలవుతోంది.ఇవన్నీ కలిసి ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గేందుకు కారకాలుగా మారుతున్నాయి.
Also Read :US Vs Russia : అమెరికాకు రష్యా భయం.. ఉక్రెయిన్ రాజధానిలో ఎంబసీకి తాళం
- 2013 సంవత్సరం నాటికి చైనా రాజధాని బీజింగ్‌లో కూడా మన ఢిల్లీలాగే కాలుష్యం ఆందోళనకర స్థాయిలో ఉండేది. ఆ ఏడాది చలికాలం సీజన్‌లో ఒకసారి బీజింగ్‌లో దాదాపు రెండు వారాల పాటు గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. అప్పట్లో దీనిపై బీజింగ్ ప్రజలు బాగా భయాందోళనకు లోనయ్యారు.
- ఆ ఏడాది చైనాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని, పారిశ్రామిక దిగ్గజం పాన్ షియి(Pan Shiyi) చైనా సోషల్ మీడియా కంపెనీ వీబోలో ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. వ్యక్తిగత వాహనాలను వదిలేసి.. మెట్రో రైళ్లలో ప్రయాణించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దానికి ప్రజలు బాగా స్పందించారు. ఎంతోమంది మెట్రో రైళ్లలో ప్రయాణించడం అలవాటు చేసుకున్నారు. పాన్ షియి కూడా మెట్రో రైలులోనే ఆఫీసుకు వెళ్లి అందరికీ రోల్ మోడల్‌గా నిలిచారు.
- అప్పటి చైనా ప్రీమియర్ లీ కెకియాంగ్ 2013లో కీలక ప్రకటన చేశారు. కాలుష్యంపై యుద్దాన్ని ఆయన ప్రకటించారు. ఇందుకోసం 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. నేషనల్ ఎయిర్ యాక్షన్ ప్లాన్‌ను లీ కెకియాంగ్ అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఏటా ఎయిర్ క్వాలిటీ సమాచారాన్ని చైనా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయసాగింది. వాయు కాలుష్యాన్ని 25 శాతం తగ్గిస్తామని ఆనాడు చైనా సర్కారు శపథం చేసింది. ఆ హామీ అమలుపై సీరియస్‌గా పనిచేసి సక్సెస్ అయింది.
- ఈక్రమంలో చైనా ప్రభుత్వం 100 ఫ్యాక్టరీలను మూసేసింది. వందలాది పరిశ్రమలను కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయించింది.
- 2 కోట్ల పాత వాహనాలను సేకరించి తుక్కులో వేయించింది.
- 2 లక్షల పారిశ్రామిక బాయిలర్లను అప్‌గ్రేడ్ చేయించింది.
- చైనాలోని దాదాపు 60 లక్షల కుటుంబాలకు సరఫరా చేసే విద్యుత్ తయారీ కోసం బొగ్గుకు బదులుగా నేచురల్ గ్యాస్‌ను వాడటం మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాలన్నీ సఫలమై చైనాలో కాలుష్య స్థాయులు తగ్గిపోయాయి. గాలి నాణ్యత మెరుగ్గా మారింది.