Site icon HashtagU Telugu

Hashtag U Hindi Launch : `హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`ను ప్రారంభించిన చ‌త్తీస్ గ‌డ్ సీఎం

Hashtag U Hindi Chattisgarh CMO Grant Launch

Chattisgad 2

`హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`(Hindi Hashtag u) వెబ్ సైట్ ను చ‌త్తీస్ గ‌డ్ ముఖ్య‌మంత్రి భూపేష్ భ‌గేల్ అధికారికంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సీఎం భూపేష్  పాల్గొన‌గా, సీఈవో ఆకుల దినేష్, హిందీ డిజిట‌ల్ హెడ్ ప్ర‌ఫుల్ పాడే  ఈ కార్య‌క్రమాన్ని నిర్వ‌హించారు.  నికార్సైన న్యూస్ ను అందిస్తూ, వాటి వెనుక ఉన్న ఆంత‌ర్యాన్ని ప్ర‌జ‌ల ముందు స్ప‌ష్టంగా ఉంచుతోన్న `హ్యాష్ ట్యాగ్ యూ` వెబ్ సైట్ గుడ్ విల్ ను సీఎం భూపేష్ ప్ర‌శంసించారు. వెబ్ సైట్ (Website)ప్రారంభానికి ముందే సంచ‌ల‌న న్యూస్ ను అంద‌చేసిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. రాబోవు రోజుల్లో హిందీ `హ్యాష్ ట్యాగ్ యూ`చ‌త్తీస్ గడ్ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌తో పాటు హిందీ రీడ‌ర్ల మ‌నుసు హ‌త్తుకునే న్యూస్ అందిస్తుంద‌ని ఆశాభావాన్ని వ్య‌క్త‌ప‌రిచారు.

హ్యాష్‌టాగ్ యూ హిందీ వెబ్‌సైట్ లింక్ : https://hindi.hashtagu.in/

హిందీ `హ్యాష్ ట్యాగ్ యూ`( Hindi Hashtag u) వెబ్ సైట్

ప్ర‌తిభ ఉన్న జ‌ర్న‌లిస్ట్ ల‌తో దినేష్ టీమ్‌ స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా ప్ర‌జ‌ల‌కు న్యూస్ అందుతుంద‌ని ఆయ‌న అన్నారు. సంచ‌ల‌నాల‌తో పాటు నిజాల‌ను స‌రైన స‌మ‌యంలో ఇస్తుంద‌న్న న‌మ్మ‌కం ఈ వెబ్ సైట్ మీద ఉంద‌ని కొనియాడారు. యంగ్ జ‌ర్న‌లిస్ట్ గా చ‌త్తీస్ గడ్ లో ప‌నిచేసిన దినేష్ పదునైన ప‌దాల‌తో జ‌ర్న‌లిజాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన విష‌యాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. హిందీ `హ్యాష్ ట్యాగ్ యూ`( Hindi Hashtag u) వెబ్ సైట్ ద్వారా సంచ‌ల‌నాల‌ను దినేష్ టీమ్ సృష్టిస్తోంద‌ని ఆశాభావాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. ఇప్ప‌టికే తెలుగు `హ్యాష్ ట్యాగ్ యూ` వెబ్ సైట్(Website) ద్వారా గుడ్ విల్ పొందార‌ని అన్నారు. రాబోవు రోజుల్లో హిందీ `హ్యాష్ ట్యాగ్ యూ` విజ‌య‌వంతం అవుతుంద‌ని అన్నారు.

`అన‌తి కాలంలోనే `హ్యాష్ ట్యాగ్ యూ` తెలుగు వెబ్ సైట్ సంచ‌ల‌నాల‌ను సృష్టించింది. ప్ర‌జాద‌ర‌ణ‌ను అందుకుంటోంది. ఏడాది కాలంలోనే తెలుగు రీడ‌ర్ల మ‌న్న‌న‌ల‌ను అందుకుంది. వాళ్ల మ‌న‌సుల‌ను హ‌త్తుకుంది.` తెలుగు జ‌ర్న‌లిజం రంగంలో సింహ‌భాగాన నిలుస్తూ సంచ‌ల‌న క‌థ‌నాల‌ను ఇస్తోన్న `హ్యాష్ ట్యాగ్ యూ` వ్య‌వ‌స్థాప‌కులు, సీఈవో దినేష్ కృషిని సీఎం భూపేష్ ప్ర‌శంసించారు. రాబోవు రోజుల్లో `హ్యాష్ ట్యాగ్ యూ` విస్త‌రించే క్ర‌మాన్ని సీఎం వెల్ల‌డించారు.

ఇంగ్లీషు ఎంట‌ర్ టైన్మెంట్ వెబ్ సైట్ తో పాటు 6 ప్రాంతీయ భాష‌ల్లో..

ఇంగ్లీషు ఎంట‌ర్ టైన్మెంట్ వెబ్ సైట్ తో పాటు 6 ప్రాంతీయ భాష‌ల్లో హ్యాష్ ట్యాగ్ యూ వెబ్ సైట్ల‌ను లాంఛ్ చేయ‌బోతుంద‌ని సీఈవో దినేష్ ప్ర‌క‌టించారు. చ‌త్తీస్ గ‌డ్ కేంద్రంగా `హ్యాష్ ట్యాగ్ యూ` హిందీ వెబ్ సైట్ ఆ రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ తో పాటు ఉత్త‌ర‌భార‌త దేశంకు సంబంధించిన వార్త‌ల మీద ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌నుంది. అలాగే, హెడ్ లైన్స్ వెనుక ఉన్న వాస్త‌వాల‌ను వెలికితీయ‌నుంది. ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిజంతో పాటు వార్త‌ల వెనుక దాగి ఉన్న నిజాల‌ను నిర్భ‌యంగా బ‌య‌ట‌పెడుతామ‌ని వివ‌రించారు. జాతీయ స్థాయిలో ప్ర‌త్యేక‌త‌ను చాటేలా `హ్యాష్ ట్యాగ్ యూ` విస్త‌రిస్తుంద‌ని అన్నారు.

Aslo read : Media Coverts : మీడియాలో జ‌న‌సేన కోవ‌ర్టులు! ప‌వ‌న్ కు బ‌ల‌మైన ఫోర్త్‌ ఎస్టేట్!

గత ఏడాదిన్న‌ర‌గా `హాట్ ట్యాగ్ యూ` నిర్వ‌హిస్తోన్న యూ టూబ్ ఛాన‌ల్ తెలుగు ప్రేక్ష‌కుల్లో గుర్తింపు పొందింది. నిష్ణాతులైన టీమ్ ఆధ్వ‌ర్యంలో యూ ట్యూబ్ ఛాన‌ల్‌ అన‌తి కాలంలోనే సంచ‌నాల‌ను న‌మోదు చేసింది. తెలుగు ప‌త్రిక, వెబ్ సైట్ వేదిక‌ల‌పై ప్ర‌త్యేక గుర్తింపు పొందేలా న్యూస్ ను ప్ర‌తి రోజూ అందిస్తోంది. ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు, సంచ‌ల‌న ఇంటారాక్ష‌న్లు, విశ్లేష‌ణ‌లు ఇస్తూ యూ ట్యూబ్ ఛాన‌ల్ తెలుగు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. సంచ‌ల‌న ఇంట‌ర్వ్యూల తో పాటు ప్ర‌భుత్వాల‌ను ఆలోచింప‌చేసే ప్ర‌శ్న‌ల‌తో ముందుకు దూసుకెళుతోంది. రాజ‌కీయ రంగంలో `హ్యాష్ టాగ్ యూ` ఛాన‌ల్ బ‌హుశా తెలియ‌ని వాళ్లు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు.

Also Read : ED Raids On Media: మీడియాపై ఈడీ దాడులు!

తెలుగు మీడియా రంగంలో దూసుకెళుతోన్న `హ్యాష్ ట్యాగ్ యూ` ఇప్పుడు హిందీ మీడియాలోకి అడుగు పెట్టింది. క్ర‌మంగా విస్తరిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. చ‌త్తీస్ గ‌డ్ కేంద్రంగా అధికారికంగా `హిందీ హ్యాష్ ట్యాగ్ యూ` ప్రారంభంలోనే సంచ‌ల‌నాల‌ను అందుకుంది. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని విజ‌యాల‌ను అందుకుంటుంద‌ని అధికారికంగా వెబ్ సైట్ ను లాంఛ్ చేసిన సీఎం భూపేష్ తో పాటు పాల్గొన్న శ్రేయోభిలాషులు అభిల‌షించారు.