Rs 200 Crores Electricity Bill : అతడొక చిరువ్యాపారి. ఇప్పటిదాకా ప్రతినెలా రూ.2వేలలోపే కరెంటు బిల్లు వచ్చేది. కానీ ఇటీవలే వచ్చిన విద్యుత్ బిల్లును చూసి అతడు అవాక్కై నోరెళ్లబెట్టాడు. ఎందుకంటే ఈసారి కరెంటు బిల్లు వందలు, వేలల్లో కాదు.. ఏకంగా వందల కోట్లలోనే వచ్చింది. జీవితాంతం కష్టపడినా తీర్చలేనంత కరెంటు బిల్లు రావడాన్ని చూసి ఆ వ్యాపారి ముక్కున వేలు వేసుకున్నాడు.
Also Read :Congress vs Regional Parties : ‘ఇండియా’లో విభేదాలు.. ఆధిపత్యం కోసం కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీల ఢీ
హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా బెహెర్విన్ జట్టన్ గ్రామానికి చెందిన వ్యాపారి లలిత్ ధీమాన్‌కు 2024 సంవత్సరం డిసెంబరు నెలకుగానూ రూ.210 కోట్లకుపైగా కరెంటు బిల్లు వచ్చింది. కరెంటు బిల్లుపై రూ.210,42,08,405 కోట్లు(Rs 200 Crores Electricity Bill) అని రాసి ఉండటాన్ని చూసి లలిత్ ఆశ్చర్యపోయాడు. నవంబరు నెలలో కేవలం రూ.2500 బిల్లు వచ్చింది. కానీ ఈసారి ఏకంగా రూ.210 కోట్ల బిల్లు ఎందుకొచ్చిందా అని ఆయన బాగా ఆలోచించాడు.చివరకు దీనిపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేయించిన అధికారులు ఒక విషయాన్ని గుర్తించారు. విద్యుత్ బిల్లును కొట్టేటప్పుడు జరిగిన సాంకేతిక లోపం వల్లే ఇంత భారీ బిల్లు వచ్చిందని గుర్తించారు. వాస్తవానికి లలిత్ ధీమాన్‌కు రూ.4,047 విద్యుత్ బిల్లు మాత్రమే వచ్చిందని తనిఖీల్లో వెల్లడైంది.
Also Read :2 Lakh Job Cuts : ఏఐ హారర్.. 2 లక్షల బ్యాంకింగ్ ఉద్యోగాలు ఉఫ్.. ‘బ్లూమ్‌బర్గ్’ సంచలన నివేదిక
గత సంవత్సరం నవంబర్‌లో గుజరాత్‌లోని వల్సాద్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముస్లిం అన్సారీ అనే టైలర్‌కు ఏకంగా రూ. 86.41 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. దీనిపై విద్యుత్ అధికారులు దర్యాప్తు చేయించగా అసలు విషయం బయటపడింది. వాస్తవానికి ముస్లిం అన్సారీకి కేవలం రూ.1,540 కరెంటు బిల్లు వచ్చిందని తేలింది. మీటర్ రీడింగ్ తీసుకున్న వ్యక్తి.. మీటర్ రీడింగ్‌కు 1 మరియు 0 అంకెలను జోడించడంతో ఇంత భారీగా కరెంటు బిల్లు వచ్చిందని వెల్లడైంది. ఈసారి హిమాచల్ ప్రదేశ్‌లో లలిత్ ధీమాన్‌కు భారీ కరెంటు బిల్లు రావడానికి కూడా ఇలాంటి లోపమే కారణమని తేలింది.