Babri Like Fate : ‘‘బాబ్రీ మసీదుకు పట్టిన గతే మహారాష్ట్రలోని ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు సమాధికి కూడా పడుతుంది’’ అని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ వార్నింగ్ ఇచ్చాయి. ఔరంగజేబు సమాధిని తొలగించేందుకు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం చొరవ చూపాలని ఆ రెండు సంస్థలు కోరాయి. ఈమేరకు డిమాండ్‌తో బజరంగ్ దళ్ సభ్యులు ఇవాళ (సోమవారం రోజు) నాగ్‌పూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఔరంగజేబు సమాధి వద్ద పోలీసు భద్రతను పెంచారు.
Also Read :US Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల దుర్మరణం
బజరంగ్ దళ్ నేత కీలక వ్యాఖ్యలు
ఖుల్దాబాద్‌లో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని(Babri Like Fate) తొలగించాలని బజరంగ్ దళ్ నాయకుడు నితిన్ మహాజన్ ఆదివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుంటే.. బాబ్రీ మసీదుకు పట్టిన గతే ఆ సమాధికి కూడా పడుతుందని ఆయన హెచ్చరిక చేశారు.
కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
‘‘వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌లు శాంతిని కోరుకోవడం లేదు’’ అని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత విజయ్ వాడేట్టివార్ సోమవారం మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా జీవించడం బజరంగ్ దళ్, వీహెచ్‌పీలకు ఇష్టం లేదన్నారు. ‘‘ఔరంగజేబు 27 సంవత్సరాల పాటు మహారాష్ట్రలోనే ఉన్నాడు. అయినా ఈ రాష్ట్రాన్ని ఏమీ చేయలేకపోయాడు. ఇన్ని దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఔరంగజేబు సమాధిని తొలగిస్తే బజరంగ్ దళ్, వీహెచ్‌పీలకు ఏం వస్తుంది ? ’’ అని విజయ్ వాడేట్టివార్ ప్రశ్నించారు.
Also Read :Gold Loan Renewal : గోల్డ్ లోన్ రెన్యూవల్.. కొత్త అప్‌డేట్ తెలుసుకోండి
సుప్రీంకోర్టు తీర్పుతో వివాదానికి తెర
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న వేలాది మంది హిందూ కర సేవకులు కూల్చేశారు. ఈ కూల్చివేత ప్రక్రియకు వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ సహా పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆనాడు సారథ్యం వహించారు. 1992 డిసెంబర్ 6న కరసేవతో రాచుకున్న బాబ్రీ మసీదు వివాదం.. 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఆ తీర్పు ప్రకారం.. అయోధ్యలోని సదరు భూమిని రామమందిర నిర్మాణం కోసం హిందువులకు కేటాయించారు. ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని కోర్టు ఆదేశించింది. గతంలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలోనే ఇప్పుడు అయోధ్య రామమందిరం ఉంది.