Site icon HashtagU Telugu

Heavy rains : జలదిగ్బంధంలో ముంబయి..రెడ్‌ అలర్డ్‌ జారీ

Heavy rains in Mumbai..Red alert issued

Heavy rains in Mumbai..Red alert issued

Heavy rains: భారీ వర్షాలతో ముంబయి అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే జోరుగా వానలు పడుతుండగా వాతావరణ శాఖ మరోసారి రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మహారాష్ట్రలోని కొంకణ్‌లో అత్యంత భారీ వర్షపాతం కురవొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. థానే, పాల్ఘర్, పూణే, కొల్హాపూర్, సతారా, రాయ్‌గఢ్, రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో బృహణ్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితిని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు సమీక్షించారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఈ భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలపై కూడా త్రీవ ప్రభావం పడింది. దీంతో ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. వర్షం కారణంగా విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. విమానాశ్రయాలకు బయల్దేరే ముందు ఫ్లైట్‌ స్టేటస్‌ తనిఖీ చేసుకోవాలంటూ ఇండిగో సంస్థ ప్రయాణికుల సూచించింది. స్పైస్‌జెట్‌ సైతం ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు విమాన కార్యకలాపాలను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయని ఎయిర్‌ ఇండియా సంస్థ తెలిపింది. ఈ కారణంగా విమానాల్లో కొన్నింటిని రద్దు చేయడం, మరికొన్నింటిని దారి మళ్లించడం వంటివి జరుగుతున్నట్లు పేర్కొంది.

Read Also: Akash Puri : ఆకాష్ పూరి అందుకే పేరు మార్చుకున్నాడా..?