తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Telangana Heavy Rains) , వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. కొన్ని చోట్ల వరదలకు ఇళ్లు కొట్టుకపోగా..మరికొన్ని చోట్ల వాగులు దాటుతూ అందులో పడి ప్రాణాలు విడిచారు. ఇక భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి (Moranchapalli) గ్రామం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇంకా ఆ గ్రామంలో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. కాగా ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లో వాగులో పడిన రైతు.. మహారాష్ట్ర (Maharashtra)లో శవమై తేలిన ఘటన వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు జనజీవనం స్థంభించింది. చాల గ్రామాలకు వెళ్లే రోడ్లు తెగిపోయి..పలు గ్రామాలు వరదలు చిక్కుకున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా చాంద (టి) గ్రామానికి చెందిన షిండే దశరథ్ (40) జులై 25 న భారీ వర్షం పడుతుండడం తో పొలంలో ఉన్న ఎద్దులను తీసుకొద్దామని ఇంటి నుండి వెళ్లాడు. ఆలా వెళ్లిన కాసేపటికే ఎద్దులు ఇంటికి వచ్చాయి. కానీ షిండే మాత్రం ఇంటికి రాలేదు. అప్పటికే వర్షం కారణంగా వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. కుటుంబ సభ్యులు ఎంతవెతికిన షిండే (Shinde Dashrath ) ఆచూకీ లభించకపోవడం తో పోలీసులకు పిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి , చుట్టుపక్కల పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గ్రామం నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని ముకూడ్‌బంద్ పర్సోడ వద్ద పెన్‌గంగ నదిలో షిండే మృతదేహం లభ్యమైనట్లు ఇక్కడి పోలీసులకు..మహారాష్ట్ర పోలీసులు ఆదివారం సమాచారం ఇచ్చారు. మూడు రోజుల క్రితమే అతడి శవం పోలీసులకు దొరికినట్లు తెలిపారు. కానీ అప్పటికే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటం, వివరాలేవీ తెలియకపోవటంతో గుర్తుతెలియని వ్యక్తిగా భావించిన మహారాష్ట్ర పోలీసులు (Maharashtra Police) అక్కడే అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఈ విషయాన్నీ ఇక్కడి పోలీసులకు చెప్పడం తో వారు ఈ విషయాన్నీ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆఖరి చూపు కూడా దక్కలేదని వారంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదొక్కటే కాదు చాల చోట్ల వర్షాలకు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో కొంతమంది ఆచూకీ లభిస్తుండగా..మరికొన్ని చోట్ల మృతదేహాలు లభ్యం అవుతున్నాయి.
Read Also : Samantha Vacation: సముద్ర తీరంలో సమంత, బాలి వెకేషన్ లో బ్యాక్ అందాలతో!