Head Constable Posts : 112 హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్) పోస్టుల భర్తీ కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు అందరూ అప్లై చేయొచ్చు. మొత్తం 112 హెడ్ కానిస్టేబుల్ పోస్టులలో 96 పురుషులకు, 16 మహిళలకు రిజర్వ్ చేశారు. సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసినవారు లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో పాసైన వారు ఈ జాబ్స్‌కు అర్హులు. అభ్యర్థుల వయస్సు 2024 ఆగస్టు 5 నాటికి 20 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అయితే కొన్ని కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఇక జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజును కట్టాలి. మహిళలు, మాజీ సైనికోద్యోగులు, ఎస్టీ, ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు లేదు.
We’re now on WhatsApp. Click to Join
దీనికి సంబంధించిన దరఖాస్తులను అభ్యర్థులు https://recruitment.itbpolice.nic.in/rect/index.php అనే వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి. జులై 7న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఆగస్టు 5 వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసే క్రమంలో ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు(Head Constable Posts) ఎంపికయ్యే వారికి ప్రతినెలా రూ.25,500 నుంచి రూ.81,100 వరకు పేస్కేల్ అమలవుతుంది.
Also Read :Ratna Bhandagar : తెరుచుకున్న జగన్నాథుడి ‘రత్న భాండాగారం’.. ఖజానా లెక్కింపు షురూ
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్- ఐఐసీటీలో జాబ్స్
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్- ఐఐసీటీ ఒప్పంద ప్రాతిపదికన 23 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం ఈనెల 16న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ పోస్టుల జాబితాలో రిసెర్చ్ అసోసియేట్-I: 01, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 03, రిసెర్చ్ అసోసియేట్: 01, జూనియర్ రిసెర్చ్ ఫెలో/ ప్రాజెక్ట్ అసోసియేట్-I: 01, ప్రాజెక్ట్ అసోసియేట్-II: 03, ప్రాజెక్ట్ అసోసియేట్-I, II: 01, ప్రాజెక్ట్ అసోసియేట్-I: 11, ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 01 ఉన్నాయి. పోస్టును అనుసరించి ఆయా విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు నెట్/ గేట్ స్కోర్, పని అనుభవం ఉన్నవాళ్లకే ప్రయారిటీ ఉంటుంది.