Crash Eyewitness: హెలికాప్టర్ కూలే ముందు ఏం జరిగిందంటే- ప్రత్యక్ష సాక్షులు

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ప్రమాదం జరగడానికి ముందు, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

  • Written By:
  • Updated On - December 10, 2021 / 11:10 AM IST

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ప్రమాదం జరగడానికి ముందు, ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లింగ్టన్ లోని ఢిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో బుధవారం మధ్యాహ్నాం ఉపన్యాసం కోసం సీడీఎస్ రావత్ హాజరుకావాల్సి ఉండింది. దీనికోసం రావత్ తన భార్య మధులికతో పాటు తన సిబ్బంది 9మందితో బుధవారం ఉదయం 9గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి తమిళనాడులోని సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సరిగ్గా 11 గంటల 45 నిమిషాలకు చేరుకున్నారు. అక్కడి నుండి ఎయిర్ ఫోర్స్ కు చెందిన Mi-17V5 హెలికాఫ్టర్ లో 11 గంటల 48 నిమిషాలకు రావత్ దంపతులో కలిపి మొత్తం 14 మంది వెల్లింగ్టన్ కు బయల్దేరారు. వెల్లింగ్టన్ లోని గమ్యస్థానానికి చేరడానికి కేవలం 5 నిమిషాల ముందు మధ్యాహ్నాం 12గంటల 22నిమిషాల సమయంలో హెలికాప్టర్ కూనూర్ కి 7 కిలోమీటర్ల దూరంలోని కట్టేరి అనే ఊరి వద్దనున్న టీ ఎస్టేట్ లోని చిన్న ఆవాసానికి దగ్గరగా ఉన్న ఒక లోయలో కూలిపోయింది.

Also Read : Last moments of CDS : నింగిలో దూసుకుపోతూ.. నిమిషాల్లో నేలకూలుతూ!

ప్రమాదంలో హెలికాఫ్టర్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని పోలీసుల‌ను, అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి స‌మాచారం అందించారు. ఈ హెలికాప్టర్ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సైన్యం రంగంలోకి దిగి గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక పోలీసులు, అధికారులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బిపిన్ రావత్,ఆయన భార్య సహా మరికొందరిని అంబులెన్స్ లలో వెల్లింగ్టన్ హాస్పిటల్ కు తరలించారు. అదే రోజు సాయంత్రం 6:30 సమయంలో బిపిన్ రావత్ తో సహా ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌లో 13 మంది దుర్మ‌ర‌ణం చెందిన‌ట్లు అధికారికంగా వాయుసేన ప్ర‌క‌టించింది.

Also Read : Sole Survivor:ఆర్మీ హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డిన ఏకైక వ్య‌క్తి ఈయనే…!

దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గిపోవడమే ప్రదామానికి కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. హెలికాఫ్టర్ పల్టీలు కొట్టి కొండల్లో ఉన్న చెట్లను ఢీకొట్టి మంటలతో కూలిపోయిందని,
ప్రమాదం జరుగుండగానే ఐదారుగురు మంటలతోపాటే కిందకు దూకేశారని ప్రత్యక్ష సాక్షులూ చెబుతున్నారు. అలా సాహసం చేసి దూకినా ఎవరు ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ లోని 13మంది మృతి చెందగా, ఆర్మీ గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ 90 శాతం గాయాలతో వెల్లింగ్టన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రమాదస్థలిని పరిశీలించిన అధికారులు ఘటనాస్థలిలో బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. ప్రమాద దర్యాప్తులో బ్లాక్‌బాక్స్‌ కీలకం కానుంది. అందులో నమోదైన సంభాషణల ఆధారంగా ప్రమాదానికి కారణాలు తెలుసుకునే వీలుంది.