Site icon HashtagU Telugu

Underwater Metro : తొలి అండర్​వాటర్​ మెట్రో వీడియో.. రేపే శ్రీకారం

Underwater Metro

Underwater Metro

Underwater Metro : మనదేశంలోనే తొలి అండర్​వాటర్‌ మెట్రో ట్రైన్ టన్నెల్‌ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో రెడీ అయింది. దీన్ని బుధవారం (మార్చి 6న) ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో టన్నెల్‌లో ప్రయోగాత్మకంగా మెట్రో ట్రైన్‌ను నడిపారు. దానికి సంబంధించిన ఒక వీడియో బయటికి వచ్చింది. హుగ్లీ నది దిగువన 16.6 కి.మీల మేర ఉన్న ప్రత్యేక టన్నెల్‌లోనే మెట్రో ట్రైన్ రయ్ రయ్ అంటూ దూసుకుపోయింది. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్​ను 45 సెకన్లలో మెట్రో ట్రైన్ దాటేస్తుంది. ఇందులో ప్రయాణించడం మనకు కచ్చితంగా సరికొత్త అనుభూతిని అందిస్తుంది.  భూమిలోపలికి 32 మీటర్ల లోతులో ఈ టన్నెల్ ఉంది. కోల్‌కతా ఈస్ట్‌, వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద ఈ టన్నెల్‌ను రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించారు. దేశంలోనే తొలిసారిగా నదీగర్భంలో(Underwater Metro) నడిచే మెట్రో రైలు సర్వీసు ఇదే.  ఈ అండర్​వాటర్​ మెట్రో టన్నెల్‌ హావ్‌డా మైదాన్​ నుంచి ఎస్‌ప్లనాడె స్టేషన్​ మధ్యలో ఉంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read :4600 RPF Jobs : రైల్వేలో 4660 ఎస్​ఐ, కానిస్టేబుల్​ పోస్టులు.. అప్లై చేసుకోండి

తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. 

మన దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ముంబై-అహ్మదాబాద్ మధ్య నడవనుంది. గుజరాత్ తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో కూడా దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రైలు ముంబైకి చేరుకున్నప్పుడు..  21 కిలోమీటర్ల పొడవైన భూగర్భ సొరంగం ద్వారా ముంబై చివరి పాయింట్ (బాంద్రా కుర్లా కాంప్లెక్స్)కు చేరుకుంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడంలో భారత్‌కు జపాన్ ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తోంది. బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 320 కిమీ వేగంతో నడుస్తుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య పరిమిత స్టాపేజ్‌లతో, ఈ బుల్లెట్ రైలు మొత్తం దూరాన్ని 127 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ప్రస్తుతం, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి బస్సులో 9 గంటలు, రైలులో 6 గంటలు పడుతుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుండి ప్రారంభమయ్యే ఈ రైలు అహ్మదాబాద్‌లోని సబర్మతి స్టేషన్‌కి చివరి గమ్యస్థానానికి చేరుకుంటుంది.

Also Read :Tonique Liquor : ‘టానిక్ లిక్కర్’‌పై రైడ్స్.. అందులో పార్ట్‌నర్స్ ఎవరో తెలుసా ?