Delhi : VHP ర్యాలీలో విద్వేషం..చేతులు, తలలు నరకండి…గన్స్ కు లైసెన్స్ లేకున్నా పర్వాలేదు..!!

దేశరాజధానిలో వీహెచ్ పీ నిర్వహించిన ర్యాలీలో విద్వేషాలు రెచ్చగొట్టారు. ఈ ర్యాలీలో ప్రసంగించిన కొందరు విద్వేషాన్ని రగిలేలా చేశారు.

Published By: HashtagU Telugu Desk
Vhp

Vhp

దేశరాజధానిలో వీహెచ్ పీ నిర్వహించిన ర్యాలీలో విద్వేషాలు రెచ్చగొట్టారు. ఈ ర్యాలీలో ప్రసంగించిన కొందరు విద్వేషాన్ని రగిలేలా చేశారు. ఎవరైనా దాడి చేయడానికి వస్తే..చేతులు, తలలు నరికివేయండంటూ పిలుపునిచ్చారు. జగత్ గురు యోగేశ్వర్ ఆచర్య ప్రసంగం విద్వేషపూరితంగాఉంది. అవసరమైతే చేతులు, తలలు నరకండి. జైలుకు వెళ్తాం అంతే కదా. కానీ ఈ శక్తులకు బుద్ధి చెప్పే సమయం వచ్చేంది .ఇలాంటి వారిని వెతికి దాడి చేయండి అంటూ పిలుపునిచ్చారు.

మహత్ నవల్ కిషోర్ దాస్ కూడా ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగం చేశారు. గన్స్ తీసుకోండి లైసెన్స్ లు తీసుకోండి. లైసెన్స్ లు లేకున్నా సరే..బాధపడకండి. మిమ్మల్ని చంపడానికి వస్తున్నవారి దగ్గర లైసెన్స్ లు ఉన్నాయా మరి మీకు ఎందుకు లైసెన్స్ అంటూ గట్టిగా అరిచారు. మితిమీరిన వ్యాఖ్యలు ఎన్నో చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను వీహెచ్ పీ ప్రతినిధి వినోద్ బన్సల్ సమర్ధించుకున్నారు. ఇది జన్ ఆక్రోశ్ ర్యాలీ అన్నారు. ఇవి ఎవర్నీ ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కావన్నారు. జిహాదీ శక్తులను ఉద్దేశించి అని తెలిపారు. ఢిల్లీలో 25ఏళ్ల వ్యక్తి హత్య నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యక్తిని ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు హత్య చేశారు. ఈ హత్యలో మతపరమైన కోణమేమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు.

  Last Updated: 09 Oct 2022, 06:58 PM IST