పహల్గామ్(Pahalgam)లో తాజాగా జరిగిన ఉగ్రదాడి పట్ల భారత దేశం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకరు పాకిస్తాన్ ఆర్మీలో పారా కమాండర్(Pakistan Army Special Forces soldier)గా శిక్షణ పొందిన హషీమ్ మూసా (Hashim Musa) అనే ఉగ్రవాది అని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. అతని సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు అత్యున్నత స్థాయి ట్రైనింగ్, ఆధునిక ఆయుధాల వినియోగ పరిజ్ఞానం ఉన్నట్లు స్పష్టమవుతోంది. హషీమ్ మూసా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో కలిసి పని చేస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
Robo Police : ‘రెడ్ బటన్’ రోబో పోలీసులు వస్తున్నారహో !!
ఈ దాడిలో ముష్కరులు వినియోగించిన ఎం4 రైఫిల్స్ వంటి ఆధునిక ఆయుధాలు, దాడి అనంతరం వారి తప్పించుకునే శైలి, అంతా కూడా ఓ వ్యూహాత్మక ప్రణాళిక ప్రకారమే సాగిందని భావిస్తున్నారు. ఈ దాడికి ముందు కూడా కాశ్మీర్‌లో జరిగిన మూడు కీలక దాడుల్లో హషీమ్ మూసా సూత్రధారిగా ఉన్నట్టు సమాచారం. ఇతడు ఎంతో ప్రమాదకరమైన ఉగ్రవాది అని అంటున్నారు. ప్రస్తుతం హషీమ్ మూసా కదలికలపై భద్రతా సంస్థలు గట్టి నిఘా పెట్టాయి. అతన్ని పట్టుకోవడం ద్వారా కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు పునాది దెబ్బతీయవచ్చని భావిస్తున్నారు.