Diwali Gift : కంపెనీ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ గా కార్లను ఇచ్చిన యజమాని

ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని ఎంకే భాటియా తన ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొంటూ.. 12 మంది స్టార్ పెర్ఫార్మర్స్‌కి కార్లను బహూకరించాడు

Published By: HashtagU Telugu Desk
Haryana Pharma Company Owne

Haryana Pharma Company Owne

యజమాని (Company Owner) అంటే ఎలా ఉంటారో తెలియంది కాదు..తమ కింద పనిచేసే ఉద్యోగులను (Employees ) చిన్న చూపు చూస్తుంటారు..పెద్దగా వారి బాగోగులు పట్టించుకోకుండా..ఎంతసేపు పనివారిగా గుర్తిస్తుంటారు. మనం డబ్బులు ఇస్తున్నాం..వారు పనిచేస్తున్నారు అంతే..అన్నట్లు వ్యవహరిస్తుంటారు. కాకపోతే అందరు ఆలా ఉండరు. కొంతమంది తమ కుటుంబ సభ్యుల వలే చూసుకుంటూ వారికీ కావలసిన సదుపాయాలు అందజేస్తూ..బోనస్ లు , పండగలకు గిఫ్ట్ లు , డబ్బులు అందిస్తూ వారి మేలు , సంతోషం కోరుకుంటుంటారు. తాజాగా హర్యానా (Haryana ) లో ఓ కంపెనీ యజమాని ఏకంగా తమ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ గా కార్లను అందజేసి వారిని సంతోషంలో ముంచెత్తారు.

We’re now on WhatsApp. Click to Join.

వివరాల్లోకి వెళ్తే..

హర్యానా.. పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని (Haryana Pharma Company Owner) ఎంకే భాటియా తన ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొంటూ.. 12 మంది స్టార్ పెర్ఫార్మర్స్‌కి (12 ‘star’ Employees) కార్లను (Cars Gift) బహూకరించాడు. ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్ హెల్త్ కేర్, సమీప భవిష్యత్తులో మరో 38 మంది ఉద్యోగులకు కార్లను అందించాలని యోచిస్తోంది. ఈ దీపావళి బహుమతి అందుకున్న వారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉండడం విశేషం. తన కంపెనీ విజయానికి ఉద్యోగుల కఠిన శ్రమ, అంకితభావం, విధేయత కారణమని పేర్కొన్నారు. వీరిలో కొందరు కంపెనీ ప్రారంభం నుంచి ఆయన వెంటే ఉన్నారు. ఈ కార్లు కేవలం దీపావళి కానుకలే కాదని, కంపెనీపై వారికి ఉన్న అచంచలమైన నిబద్ధత, విశ్వాసానికి రివార్డులని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గిఫ్టుగా కారు అందుకున్న వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా రాదట. ఇలాంటి గిఫ్టులను తాము కలలో కూడా ఊహించలేదని ఉద్యోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Read Also : Nepal Earthquake : నేపాల్ భూకంపం ఘటనలో గంట గంటకు పెరుతున్న మృతుల సంఖ్య

  Last Updated: 04 Nov 2023, 12:56 PM IST