Dera chief shot dead : ఉత్తరాఖండ్‌ డేరా చీఫ్‌పై దుండగుల కాల్పులు

  Dera chief shot dead: ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. (Dera chief shot dead) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉధమ్ సింగ్ నగర్(Udham Singh Nagar) జిల్లాలోని రుద్రపూర్-తనక్‌పూర్(Rudrapur-Tanakpur) మార్గంలో నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఉన్నది. సిక్కుల పుణ్యక్షేత్రానికి బాబా టార్సెమ్ సింగ్‌ డేరా చీఫ్‌గా ఉన్నారు. We’re now on WhatsApp. […]

Published By: HashtagU Telugu Desk
Gurudwara Nanakmatta Dera Chief shot dead in Uttarakhand

Gurudwara Nanakmatta Dera Chief shot dead in Uttarakhand

 

Dera chief shot dead: ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. (Dera chief shot dead) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉధమ్ సింగ్ నగర్(Udham Singh Nagar) జిల్లాలోని రుద్రపూర్-తనక్‌పూర్(Rudrapur-Tanakpur) మార్గంలో నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఉన్నది. సిక్కుల పుణ్యక్షేత్రానికి బాబా టార్సెమ్ సింగ్‌ డేరా చీఫ్‌గా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.

కాగా, గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడకు వచ్చారు. కుర్చీలో కూర్చొని ఉన్న డేరా చీఫ్‌ బాబా టార్సెమ్ సింగ్‌పై గన్‌తో కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర బుల్లెట్‌ గాయాలతో ఆయన కిందపడిపోయారు. గమనించిన అనుచరులు బాబా టార్సెమ్ సింగ్‌ను వెంటనే ఖతిమాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.

Read Also: Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌.. సీబీఐ విచారణ జరిపించాలి : లక్ష్మణ్

మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆ గురుద్వారా వద్ద అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. శాంతి వహించాలని సిక్కు ప్రజలకు పిలుపునిచ్చారు. హంతకులను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, ఆ ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డైన కాల్పుల వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

 

 

  Last Updated: 28 Mar 2024, 03:19 PM IST