Death Threat : జనవరి 26న సీఎంను హత్య చేస్తాం.. పన్నూ మరో వార్నింగ్

Death Threat :  అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బరితెగించి భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు.

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 03:48 PM IST

Death Threat :  అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బరితెగించి భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్​పై దాడి చేసి చంపుతామని వార్నింగ్ ఇచ్చాడు. త్రివర్ణ పతాకాన్ని సీఎం మాన్ ఎగురవేసే చోటే దాడి చేస్తామన్నాడు.  ఇందుకోసం పంజాబ్​లోని గ్యాంగ్​స్టర్లు తనను సంప్రదించాలని కోరాడు. ఈమేరకు ఒక వీడియోను అతడు విడుదల చేశాడు. గతంలో ఆత్మాహుతి దాడిలో చనిపోయిన పంజాబ్ మాజీ సీఎం బియంత్ సింగ్​తో.. ప్రస్తుత సీఎం గురుపత్వంత్ సింగ్ మాన్​ను పన్నూ పోల్చాడు. పంజాబ్‌లో శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు వరుసపెట్టి గ్యాంగ్​స్టర్లను ఎన్‌కౌంటర్ చేయిస్తున్న రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్​కు కూడా పన్నూ వార్నింగ్ ఇచ్చాడు. ‘‘పంజాబ్ పోలీసులు యువతను అణచివేస్తున్నారు. వారిని ఎన్​కౌంటర్ చేస్తున్నారు. యువతపై గ్యాంగ్​స్టర్లు అనే ముద్రవేసి జైళ్లలో వేస్తున్నారు. నేటి బియంత్ సింగ్‌గా మారిన సీఎం భగవంత్ మాన్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున ఈ పరిణామాలు మారిపోతాయి’’ అని గురుపత్వంత్ సింగ్ పన్నూ(Death Threat) చెప్పాడు.

We’re now on WhatsApp. Click to Join.

  • యూకే-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన గురుపత్వంత్ సింగ్ పన్నూ  ఒక ఖలిస్తాన్‌ ఉగ్రవాది.
  • ఇతనికి పాకిస్తాన్, ఐఎస్ఐతో లింకులు కూడా ఉన్నాయి.
  • పన్నూ నడిపే సిక్ ఫర్ జస్టిస్ సంస్థను ఉగ్రసంస్థగా భారత్ గుర్తించింది.
  • ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలతో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు గతేడాది జూన్‌లో అరెస్ట్ చేశారు.
  • ప్రస్తుతం నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నాడు.
  • ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో నిందితుడైన భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తాకు ఆధారాలు అందజేతకు అమెరికా నిరాకరించింది.
  • ప్రస్తుతం ప్రాగ్‌ జైల్లో ఉన్న అతడిని అధీనంలోకి తీసుకోవడం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
  • ఈ క్రమంలోనే జనవరి 4న గుప్తా తరఫు న్యాయవాది.. న్యూయార్క్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
  • ఈ కేసులో నిఖిల్ గుప్తా న్యూయార్క్‌ కోర్టులో హాజరైనప్పుడు మాత్రమే తాము ఆధారాలను అందజేస్తామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • దేశపౌరుడు అనే కారణాన్ని చూపించి.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూను రక్షించేందుకు అమెరికా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ పరిణామాలు అద్దంపడుతున్నాయి.

Also Read: YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల.. ప్రకటించిన పార్టీ అధిష్టానం