Car Hits Bike: దారుణ ఘటన.. కారుతో టూవీలర్ ను ఢీ కొట్టి 12. కి.మీ. లాక్కుపోయాడు..!

ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలాగే గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. జనవరి 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ పాటిల్ తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు (Car Hits Bike) ఢీకొట్టింది.

  • Written By:
  • Publish Date - January 25, 2023 / 09:14 AM IST

ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలాగే గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. జనవరి 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ పాటిల్ తన భార్యతో బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు (Car Hits Bike) ఢీకొట్టింది. దీంతో కారు కింద భాగంలో చిక్కుకున్న సాగర్‌ను 12 కి.మీ లాక్కెళ్లడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.

గుజరాత్‌లోని సూరత్‌లో బైక్‌పై వెళ్తున్న దంపతులను ఓ కారు డ్రైవర్‌ ఢీకొట్టాడని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత బైక్‌పై నుంచి కిందపడి భార్యకు గాయాలయ్యాయి. కాగా 12 కిలోమీటర్ల దూరంలో భర్త మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో ఢీకొన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. జనవరి 18న సూరత్‌లోని పల్సానా తహసీల్‌లో బైక్ రైడర్ జంటను కారు డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ సమయంలో భార్య అక్కడే పడిపోయింది. ఆమె భర్త మృతదేహం 12 కిలోమీటర్ల దూరంలో కనుగొనబడింది. ఈ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించిన వీడియో పోలీసులకు అందింది. దాని ఆధారంగా పోలీసులు కారును ట్రేస్ చేయగలిగారు. ఘటనానంతరం నిందితుడు కారు యజమాని పరారీలో ఉన్నాడు.

జనవరి 18వ తేదీ రాత్రి అశ్వని, సాగర్ ఇద్దరూ బైక్‌పై బంధువుల ఇంటి నుంచి ఇంటికి వస్తున్నారు. పల్సానా తహసీల్ తాటితయ్య గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో అశ్వని బైక్‌పై నుంచి కిందపడింది. కాగా ఢీకొన్న తర్వాత సాగర్‌ అక్కడ కనిపించలేదు. ఈ విషయాన్ని ప్రజలు అశ్వని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కొద్దిసేపటికి బంధువులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ సాగర్ ఆచూకీ లభించలేదు. చికిత్స నిమిత్తం అశ్వని ఆస్పత్రికి తరలించారు. దీని తర్వాత సాగర్ అన్వేషణ ప్రారంభమైంది. సంఘటనా స్థలంలో సాగర్ కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: Today Gold And Silver Rate: ప‌సిడి ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌.. పెరిగిన బంగారం ధ‌ర‌లు..!

మరోవైపు.. కమ్రేజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోస్మాడి గ్రామ సమీపంలో రోడ్డు పక్కన మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడే సాగర్ మిస్సింగ్ ఫిర్యాదు పల్సానా పోలీస్ స్టేషన్‌లో ధృవీకరించబడింది. ఆ తర్వాత మృతదేహం సాగర్‌ పాటిల్‌దేనని తెలిసింది. ఘటనా స్థలానికి 12 కిలోమీటర్ల దూరంలో సాగర్ మృతదేహం లభ్యమైంది. ఈ హిట్ అండ్ రన్ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. సూరత్ పోలీసులకు ఓ వీడియో అందిందని, అందులో కారు వేగంగా వెళుతున్నట్లు గుర్తించామని డీఎస్పీ హితేష్ జోయిసర్ తెలిపారు. దీని తర్వాత వీడియో రికార్డ్ చేసిన వ్యక్తిని సంప్రదించగా, అతను తన కారులో వెళుతున్నానని, కోస్మాడి గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న కారు నుండి ఒక వ్యక్తి మృతదేహం పడిపోయిందని చెప్పాడు. విషయం తీవ్రతను గ్రహించి కారును వెంబడించి వీడియో తీశాడు.

వీడియో ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా.. అసలు విషయం బయటపడింది. ప్రమాదానికి కారణమైన కారు సూరత్‌కు చెందిన వీరేన్ అహిర్‌కు చెందినదని పోలీసులు చెబుతున్నారు. ఆర్టీఓ, ఇతర నిఘా ఆధారంగా పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని పరారీలో ఉన్నాడు. ఈ కేసులో పోస్టుమార్టం ఆధారంగా ఈడ్చుకెళ్లడం వల్లే సాగర్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించినట్లు డీఎస్పీ హితేష్ జోయిసర్ తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.