Grenade Attack : పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న సూరన్ కోట్ ఆర్మీ పోస్టుపైకి గ్రనేడ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ పోస్టుపైకి ఉగ్రవాదులు రెండు గ్రనేడ్లను విసరగా.. వాటిలో ఒకటే పేలింది. మరొకటి పేలలేదు. పేలకుండా మిగిలిపోయిన బాంబును భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. ఆర్మీ క్యాంపు కాంపౌండ్ వాల్ వద్ద పేలిన గ్రనేడ్ సేఫ్టీ పిన్(Grenade Attack)ను గుర్తించారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి భారీ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో ప్రాణనష్టం సంభవించలేదు. అంతకుముందు రోజు (మంగళవారం) శ్రీనగర్‌లోని హర్వాన్‌లో ఉన్న దాచిగామ్ అటవీ ప్రాంతంలో లష్కరే తైబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇది జరిగిన మరుసటిరోజే ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి జరగడం గమనార్హం.
Also Read :Google Hyderabad : హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం
తమ దేశ ప్రజలకు బ్రిటన్ ప్రభుత్వం సంచలన అడ్వైజరీని జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. బంగ్లాదేశ్‌లోని రద్దీ ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు, పర్యాటక ప్రాంతాల్లో తీవ్రదాడులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. అలాంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని బ్రిటన్ పౌరులను కోరింది. బంగ్లాదేశ్‌లోని మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగొచ్చని తెలిపింది. బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ఐఈడీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని తమకు సమాచారం అందిందని బ్రిటన్ సర్కారు వెల్లడించింది. ఇస్కాన్ ప్రచారకర్త కృష్ణదాస్‌ను దేశద్రోహ ఆరోపణలపై బంగ్లాదేశ్ సర్కారు అరెస్టు చేయించింది. దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన ఇండో-పసిఫిక్ వ్యవహారాల మంత్రి కేథరీన్ వెస్ట్ దీనిపై స్పందిస్తూ.. ‘‘యూకే ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (FCDO) ఆ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది’’ అని చెప్పారు. మైనార్టీ వర్గాల భద్రత విషయంలో ఇటీవలే బంగ్లాదేశ్ తమకు హామీ ఇచ్చిందన్నారు.