Great Himalayan Earthquake : ఇప్పుడు అంతటా ‘గ్రేట్ హిమాలయన్ భూకంపం’ గురించే చర్చ జరుగుతోంది. మయన్మార్‌లో ఇటీవలే వచ్చిన భారీ భూకంపాన్ని మించిన రేంజులో.. అది ఉంటుందనే అంచనాలు భారతీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేకించి భారత్‌లో హిమాలయాలు విస్తరించి ఉన్న రాష్ట్రాలను ఈ అంచనా కలవరానికి గురి చేస్తోంది. ఇంతకీ ఏమిటీ ‘గ్రేట్ హిమాలయన్ భూకంపం’ ? దీని తీవ్రత ఎలా ఉంటుంది ? ప్రభావితమయ్యే ప్రాంతాలు ఏవి ? తెలుసుకుందాం..
Also Read :2025 Prophecies: 2025లో బాబా వంగా చెప్పినట్టే జరిగిన అంశాలివీ.. ఫ్యూచర్‌లో అవన్నీ
భారత్‌లోని హిమాలయ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి ?
జమ్మూకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలో హిమాలయాలు ఉన్నాయి. అయితే అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో హిమాలయాలు ఉన్నాయి.
భారత్‌లో పెను భూకంపం ఎప్పుడు ?
భారత్‌లోని హిమాలయన్ రాష్ట్రాల పరిధిలో 2060 నాటికి భారీ భూకంపం(Great Himalayan Earthquake) వస్తుందట. అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త క్రిస్ గోల్డ్‌ఫింగర్, ఆయన సహచరులు ఈమేరకు అంచనాతో ఒక నివేదికను విడుదల చేశారు. 2060 నాటికి హిమాలయన్ ప్రాంతంలో వినాశకరమైన భూకంపం సంభవించేందుకు 37 శాతం ఛాన్స్ ఉందని వారు తెలిపారు. దీనివల్ల భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరుగుతాయన్నారు. ఆ భూకంపంతో భారత్‌లోని చండీగఢ్, ఢిల్లీ వంటి అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాలు ప్రభావితం అవుతాయని సైంటిస్టులు చెప్పారు. భారత్‌లోని హిమాలయ రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న నేపాల్ సైతం ఈ భూకంపంతో వణుకుతాయన్నారు. చివరిసారిగా 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సునామీ వచ్చింది. దీంతో భారతదేశం సహా అనేక దేశాలలో 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితులు అయ్యారు. అప్పట్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.3గా నమోదైంది. 2060 సంవత్సరం నాటికి హిమాలయ ప్రాంతంలో సంభవించే భూకంపం తీవ్రత ఇంతకంటే ఎక్కువే ఉంటుందని అంటున్నారు.