Site icon HashtagU Telugu

Maternity Leaves : కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ఇకపై వారికీ మెటర్నిటీ లీవ్స్

Maternity Leaves

Maternity Leaves :  కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ శుభవార్త కేంద్ర ప్రభుత్వ  మహిళా ఉద్యోగుల కోసం. సరోగసీ (అద్దెగర్భం)  ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులు కూడా ఇక మెటర్నిటీ లీవ్స్‌ను పొందొచ్చు. సరోగసీ ద్వారా పిల్లలు పుడితే ప్రభుత్వ మహిళా ఉద్యోగినులు 180 రోజుల మెటర్నిటీ లీవ్స్‌ను వాడుకోవచ్చు. పురుష ప్రభుత్వ ఉద్యోగి భార్యకు సరోగసీ ద్వారా  పిల్లలు కలిగి, అతడికి ఇద్దరు కంటే తక్కువ పిల్లలు ఉంటే బిడ్డ పుట్టిన తేదీ నుంచి 6 నెలలలోగా 15 రోజుల పాటు పితృత్వ సెలవులను తీసుకోవచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఈ మేరకు 50 ఏళ్ల కిందటి మెటర్నిటీ లీవ్స్(Maternity Leaves) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.  అద్దె గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లిదండ్రులకు చైల్డ్ కేర్ లీవ్స్ తీసుకునే హక్కును కల్పిస్తూ  సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్- 1972లో కేంద్ర సర్కారు సవరణలు చేసింది. సరోగసీ ద్వారా సంతానం పొందే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులను మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు  లేవు. తాజాగా ఆ నిబంధనలను సవరించి కొత్త రూల్స్​ను తీసుకొచ్చారు. ఇవి జూన్​ 18 నుంచే అమల్లోకి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also Read :Dharmendra Pradhan: కేంద్రమంత్రికి చేదు అనుభవం.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌!

2022 సంవత్సరంలోనే ఏపీలో..

వాస్తవానికి ఈ అంశంపై ఏపీ హైకోర్టు 2022 సంవత్సరం జులైలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సౌదామణి సరోగసీ (అద్దెగర్భం) ద్వారా తల్లి అయ్యారు. తన బిడ్డ ఆలన పాలన చూసుకొనేందుకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని డీఈవోను ఆమె కోరారు. కానీ డీఈవో సెలవులు ఇవ్వడానికి నో చెప్పారు. దీంతో సౌదామణి హైకోర్టును ఆశ్రయించారు. అద్దెగర్భం ద్వారా తల్లులైన అయిన ప్రభుత్వ ఉద్యోగినులు.. తమ బిడ్డల బాగోగులు చూసుకునేందుకు 180 రోజుల పాటు సెలవులు తీసుకునేందుకు అర్హులే అంటూ ప్రభుత్వం జీవో33 విడుదల చేసిన విషయాన్ని సౌదామణి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ఏపీ హైకోర్టు సరోగసీ ద్వారా తల్లి అయినా సరే ప్రసూతి సెలవులకు ప్రభుత్వ ఉద్యోగిని అర్హురాలే అని స్పష్టం చేసింది. సరోగసి అయినా సరే శిశువు ఆలన పాలన చూసుకోవాల్సిన బాధ్యత తల్లిపైనే  ఉంటుందని గుర్తు చేసింది. ఆ ఏడాది (2022) మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా సెలవులు మంజూరు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.

Also Read :Vitamin C : మెరిసే చర్మానికి విటమిన్ సి అవసరం.. ఈ ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోండి..!