8th పే కమిషన్ (8th Pay Commission) కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 8వ పే కమిషన్ అంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను సమీక్షించి కొత్తగా నిర్ణయించే కమిషన్. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ, ఉద్యోగుల జీవన స్థితిగతులు, ద్రవ్యోల్బణం, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని జీతాలను పెంచుతుంది. ఇప్పటివరకు 7 పే కమిషన్లు ఏర్పాటు కాగా, తదుపరి 8వ పే కమిషన్‌పై అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. అయినప్పటికీ దీనిపై ఉద్యోగ సంఘాలు భారీ ఆశలు పెట్టుకున్నారు.
Constipation : జీర్ణక్రియకు హాని కలిగించే అలవాట్లు..మలబద్ధకాన్ని నియంత్రించడానికి ఆయుర్వేద చిట్కాలు!
తాజాగా Ambit Capital అనే ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ అంచనా ప్రకారం… 8వ పే కమిషన్ అమలైతే జీతాలు మరియు పెన్షన్లు సగటున 30-34% వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. ఈ కమిషన్ అమలుతో 44 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు లాభపడతారని అంచనా. ముఖ్యంగా బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్‌లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
8వ పే కమిషన్ అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఇది 2026 జనవరి నుంచి అమలవ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగుల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే దిశగా ఈ కమిషన్ కీలకంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు దీనిపై ప్రకటన చేస్తుందా అన్నదానిపై ఉద్యోగుల్లో ఇప్పుడే ఆసక్తి నెలకొంది.