Site icon HashtagU Telugu

Centre Notifies GPS Based Toll System : శాటిలైట్‌ ఆధారిత టోల్‌ పద్ధతి అమల్లోకి.. కేంద్రం నోటిఫికేషన్.. ఏమిటిది ?

Toll Tax

Toll Tax

Centre Notifies GPS Based Toll System : కేంద్ర రవాణా శాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలోని టోల్ ప్లాజాల వద్ద శాటిలైట్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు వ్యవస్థను అమల్లోకి తెస్తూ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు -2008ను సవరిస్తూ ప్రకటన జారీ చేసింది.  దీంతో టోల్‌ ప్లాజాల వద్ద గ్లోబల్‌ నావిగేషన్ శాటిలైట్‌ సిస్టమ్‌  ఆధారిత టోల్‌ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఫాస్టాగ్‌, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్ రికగ్నిషన్‌ టెక్నాలజీకి అదనంగా ఈ కొత్త విధానం(Centre Notifies GPS Based Toll System) అమలవుతుందని కేంద్రం తెలిపింది.

Also Read :Jackals Terror : నక్కను 15 అడుగుల దూరం విసిరి పారేశాడు.. అసలు ఏమైందంటే ?

నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌తో కూడిన ఆన్‌ బోర్డు యూనిట్‌‌ను  కలిగిన వాహనాలు ఇక నుంచి టోల్‌ ప్లాజా మీదుగా వెళ్లినప్పుడు.. అవి ట్రావెల్ చేసిన దూరానికి అనుగుణంగా టోల్‌ ఫీజు ఆటోమేటిక్‌గా బ్యాంకు అకౌంటు నుంచి కట్ అయిపోతుంది. ఈ తరహా వాహనాల కోసం టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్‌లను ఏర్పాటు చేస్తారు. ఈవిధానాన్ని తొలుత ప్రధాన జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై  అమలు చేస్తారు. తదుపరిగా దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద అమల్లోకి తీసుకొస్తారు. నావిగేషన్ డివైజ్‌ లేని వాహనాల నుంచి సాధారణ తరహా టోల్‌ ఛార్జీలనే వసూలు చేస్తారు.

Also Read :Sebi Chief Received Crores : మహీంద్రా గ్రూప్‌ నుంచి రూ.కోట్లు సంపాదించారు.. సెబీ చీఫ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణలు

మరో కొత్త నిబంధన  ఏమిటంటే.. జాతీయ రహదారులపై 20 కిలోమీటర్ల వరకు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. టోల్‌ను వసూలు చేయని 20 కిలోమీటర్ల పరిధిని జీరో టోల్ కారిడార్ అని పిలుస్తారు. అంతకంటే ఎక్కువ దూరం జర్నీ చేస్తే .. దూరానికి తగిన స్థాయిలో టోల్ పేమెంటు చేయాల్సి ఉంటుంది. వీటిని భారత రవాణా వ్యవస్థ రూపురేఖలను మార్చే  సంస్కరణలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తద్వారా టోల్ ప్లాజాల వాహనదారులకు క్యూ లైన్ల బెడద తప్పుతుంది. దీనివల్ల వారి విలువైన సమయం ఆదా అవుతుంది.