దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ (FASTag ) చెల్లింపుల విషయంలో రెండు కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఫాస్టాగ్ లేని వాహనదారులు టోల్ చార్జీకి రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చేది. కానీ, కొత్త నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ లేకున్నా UPI ద్వారా 1.25 రెట్లు చెల్లిస్తే టోల్ గేట్ దాటవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, నగదు రూపంలో చెల్లిస్తే మాత్రం ఇప్పటిలాగే రెట్టింపు చార్జీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.
Cough: విపరీతమైన దగ్గు సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
కొన్ని సందర్భాల్లో ఫాస్టాగ్ ఖాతాలో సరిపడా డబ్బు ఉన్నప్పటికీ టోల్ గేట్లలో సాంకేతిక లోపం వల్ల అమౌంట్ కట్ కాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు ఎటువంటి చార్జీ చెల్లించకుండా ఉచితంగా వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం వాహనదారులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది. టోల్ ప్లాజాల వద్ద సాంకేతిక సమస్యల కారణంగా వాహనాలు ఆగిపోకుండా త్వరగా రాకపోకలు జరగడం దీని ద్వారా సాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఫాస్టాగ్ చెల్లింపులకు సంబంధించిన ఈ కొత్త రూల్స్ నవంబర్ 15 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. దీని ద్వారా వాహనదారులకు మరింత సౌకర్యం లభించనుంది. ఫాస్టాగ్ లేకున్నా డిజిటల్ పేమెంట్ ద్వారా తక్కువ మొత్తంలో చెల్లించుకునే అవకాశం, అలాగే సాంకేతిక లోపం ఉన్నప్పుడు ఉచితంగా వెళ్లే అవకాశం వాహనదారుల భారం తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం టోల్ ప్లాజాలలో పారదర్శకతను, సాంకేతిక సమర్థతను పెంచుతుందని భావిస్తున్నారు.
