Site icon HashtagU Telugu

Big boost for Movie Lovers : మల్టీప్లెక్స్‌ల టికెట్ ధరల దోపిడీకి చెక్ పెట్టిన ప్రభుత్వం

Movie Ticket Price 200

Movie Ticket Price 200

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka Chief Minister Siddaramaiah) 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 4,08,647 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌(Budget)ను ప్రవేశపెట్టారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, మైనారిటీ సంక్షేమంతో పాటు వినోద రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా సినిమా టికెట్ ధరలను (Ticket prices) రూ.200లకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కూడా సినిమా మరింత చేరువ కానుందని తెలిపారు.

IPS Officers : రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు

మల్టీప్లెక్స్‌ల టికెట్ ధరల దోపిడీకి చెక్ పెట్టే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా టిక్కెట్ల ధరలు రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఉండడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2017లో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగినా, న్యాయపరమైన కారణాల వల్ల అది అమలు కాలేదు. అయితే, ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ సంస్కరణను తప్పకుండా అమలు చేస్తామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

Rohit- Kohli Retire: ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్ త‌ర్వాత విరాట్‌, రోహిత్ రిటైర్మెంట్‌?

కన్నడ సినీ పరిశ్రమకు కొత్త ఊపిరి ఇచ్చేలా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషా సినిమాలకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక OTT ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) ద్వారా అభివృద్ధి చేయనున్న ఈ ఫిల్మ్ సిటీకి రూ. 500 కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా వేస్తున్నారు.