రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

PM Kisan  దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గువాహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తోంది. 2019 లో ఎన్డీయే […]

Published By: HashtagU Telugu Desk
PM Kisan

PM Kisan

PM Kisan  దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన నేపథ్యంలో శుక్రవారం గువాహటి వేదికగా నిధులు విడుదల చేస్తారని తెలిపింది. రైతాంగానికి పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏటా రూ. 6 వేలు అందిస్తోంది.

2019 లో ఎన్డీయే సర్కారు ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా.. ఏటా మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. శుక్రవారం ప్రధాని మోదీ మొత్తం రూ.19 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు చొప్పున జమ అవుతాయని అధికారులు తెలిపారు.

  Last Updated: 11 Mar 2026, 11:05 AM IST