EPS Pensioners : కేంద్ర కార్మిక శాఖ కీలక ప్రకటన చేసింది. ఈపీఎస్ పింఛన్‌దారులు 2025 సంవత్సరం జనవరి 1 నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చని వెల్లడించింది. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్(సీపీపీఎస్) అందుబాటులోకి వస్తుండటం వల్ల ఈ సౌలభ్యాన్ని ఈపీఎస్ పింఛన్‌దారులు ఎంజాయ్ చేయొచ్చని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join
ఈవివరాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్ ట్రస్ట్‌బోర్డ్ ఛైర్మన్ మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ సౌకర్యం వల్ల 78 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇక నుంచి పింఛన్‌దారులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఏదైనా బ్యాంక్ లేదా శాఖ మార్చుకోవాల్సిన సందర్భంలోనూ ఈ సదుపాయం ఉపయోగపడుతుందని చెప్పారు.
Also Read :SEBI Chief : సెబీ చీఫ్ టార్చర్ చేస్తున్నారు.. ఆర్థికశాఖకు 500 మంది అధికారుల ఫిర్యాదు
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ జోనల్/ప్రాంతీయ కార్యాలయాలు కేవలం మూడు నుంచి నాలుగు బ్యాంకులతోనే ఒప్పందాలను కలిగి ఉన్నాయి. పింఛను (EPS Pensioners) ప్రారంభ సమయంలో పింఛనుదారులు ధ్రువీకరణ కోసం సంబంధిత బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సెంట్రలైజ్డ్ విధానం 2025 జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తే.. పింఛను ప్రారంభ సమయంలో బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పింఛన్ రిలీజైన వెంటనే ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఈ కొత్త సిస్టమ్ కారణంగా పింఛను పంపిణీలో ఖర్చు తగ్గిపోతుంది. వచ్చే ఏడాది చివరికల్లా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
Also Read :First Drone Attack : భద్రతా దళాలపై తొలిసారిగా డ్రోన్ దాడి.. మణిపూర్‌కు ఎన్‌ఎస్‌జీ నిపుణులు
ఎర్లీ పెన్షన్ కావాలా ?
కనీసం పదేళ్ల సర్వీసును పూర్తిచేసుకున్న ఉద్యోగులు ఈపీఎఫ్ ఎర్లీ పెన్షన్ పొందడానికి అర్హులు. అయితే సదరు ఉద్యోగుల వయస్సు 50-58 ఏళ్లలోపు ఉండాలని గుర్తుంచుకోవాలి. 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్నవారు ఎర్లీ పెన్షన్ పొందడానికి అర్హులు కాదు. 58 ఏళ్ల కంటే ముందే పెన్షన్ పొందాలని భావిస్తే.. వచ్చే పింఛన్ ఒక్కో ఏడాదికి 4 శాతం చొప్పున తగ్గుతూపోతుంది. 60 ఏళ్ల తరువాత పింఛన్ పొందితే.. ఏడాదికి 4 శాతం చొప్పున వచ్చే పెన్షన్ పెరుగుతూపోతుంది.