జూలై నెల ప్రారంభం కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్తను తీసుకొచ్చింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తాజాగా ప్రకటించిన ధరల సవరణ ప్రకారం.. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.58.50 వరకు తగ్గింపును అమలు చేసినట్లు వెల్లడించారు. ఈ తగ్గింపు జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ.1,723 నుండి రూ.1,665కు పడిపోయింది. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లోనూ తగ్గించిన ధరలు వర్తించనున్నాయి.
Soleus Push Ups: సోలస్ పుషప్‌లు అంటే ఏమిటి? దీని వలన ఉపయోగం ఉందా?
ప్రతి నెల మొదటిరోజు చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షిస్తూ, అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పాటు దిగుమతి వ్యయాలను ఆధారంగా తీసుకుని నిర్ణయాలు తీసుకుంటాయి. ఈసారి ధరల సవరణ వినియోగదారులకు కొంత ఊరట కలిగించనుంది. ముఖ్యంగా హోటళ్లకు, రెస్టారెంట్లకు, బేకరీలకు తరచుగా అవసరమయ్యే కమర్షియల్ సిలిండర్లపై ధర తగ్గింపుతో వ్యయభారం కొంత తగ్గనున్నది. ఇది చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఉపశమనంగా మారనుంది.
అయితే గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా ఉన్నాయి. ఇకపోతే, గ్యాస్ ధరలు ప్రతి రాష్ట్రంలో భిన్నంగా ఉండే అవకాశం ఉంది, ఇది స్థానిక పన్నులు, టాక్స్‌లు ఆధారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం లేదా చమురు సంస్థలు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా రేట్లు స్థానికంగా మారవచ్చు. మొత్తంగా, కమర్షియల్ వినియోగదారులకు జూలై మొదటివారంలోనే మంచి ఊరట లభించినట్లయింది.