Site icon HashtagU Telugu

Go First Airlines: ప్రయాణికులకు డబ్బులు రిటర్న్ చేయనున్న GoFirst ఎయిర్‌లైన్స్

Go First Airlines

New Web Story Copy (77)

Go First Airlines: నిధుల కొరత కారణంగా మే 3 నుండి మే 5 వరకు తన కార్యకలాపాలను మూసివేయనున్నట్లు మంగళవారం GoFirst ఎయిర్‌లైన్ ప్రకటించింది. అయితే ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. తమ టికెట్ డబ్బులు రిటర్న్ వస్తాయా లేదా అని టెన్షన్ పడుతున్న పరిస్థితి. కాగా టికెట్ డబ్బులు రిటర్న్ చేస్తామని తాజాగా గోఫస్ట్ ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా కేంద్రం మంత్రి సైతం ఈ సమస్యపై స్పందించారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ఇష్యూపై స్పందించారు. భారత ప్రభుత్వం గోఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు అన్ని విధాలుగా సహాయం చేస్తోందని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడం విమానయాన సంస్థ బాధ్యత అన్నారు. మే 3 నుండి మే 5 వరకు విమానాల రద్దు గురించి ముందస్తుగా తెలియజేయనందుకు గోఫస్ట్ ఎయిర్‌లైన్‌కు బుధవారం DGCA నోటీసు జారీ చేసింది.ప్రాట్ & విట్నీ ఇంజిన్‌ల వైఫల్యం కారణంగా విమానాల్లో 50 శాతానికి పైగా కంపెనీ నష్టాలను చవిచూస్తోందని ఎయిర్‌లైన్ పేర్కొంది. దీనివల్ల ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి లేదన్నది

విమానాల రద్దు గురించి సమాచారం ఇస్తూ, టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ త్వరలో వాపసు ఇవ్వబడుతుందని GoFirst Airline తెలిపింది. అయితే, ఈ రీఫండ్ చెల్లింపు మోడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకున్నట్లయితే డబ్బు సదరు ట్రావెల్ ఏజెన్సీకి వెళ్తుందని చెప్పింది. మరోవైపు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్లయితే డబ్బు నేరుగా మీ ఖాతాకు వస్తుంది.

Read More: Pushpa2 Audio Rights: ఆడియో రైట్స్ లో ‘పుష్ప2’ రికార్డ్.. ఏకంగా 60 కోట్లకుపైగా!