Gautam Gambhir: చంపేస్తామంటూ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ బెదిరింపులు

షెహబాజ్‌ షరీఫ్‌ను విమర్శించే వారి జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా(Gautam Gambhir) కూడా చేరిపోయారు.

Published By: HashtagU Telugu Desk
Gautam Gambhir Death Threat Isis Kashmir Bjp

Gautam Gambhir: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించినందుకు భారత క్రికెట్ హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ‘‘మిమ్మల్ని చంపేస్తాం’’ అంటూ ఈ మెయిల్ ద్వారా దుండగులు బెదిరింపు సందేశాన్ని పంపారు. దీనిపై ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబానికి తగిన భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీసులను గౌతమ్ గంభీర్ కోరారు. ‘‘బుధవారం మధ్యాహ్నమే నాకు బెదిరింపు ఈమెయిల్ అందింది. అందులో ఐ కిల్ యూ అని రాసి ఉంది. అదే రోజు సాయంత్రం మరో ఈమెయిల్ వచ్చింది. అందులో సైతం అదే సందేశం ఉంది’’ అని పోలీసులకు గౌతమ్ గంభీర్ వివరించారు.

Also Read :India Vs Pak : ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌‌కు షాక్.. కీలక చర్యలు

ఈమెయిల్‌పై దర్యాప్తు షురూ 

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ?  ఎవరు పంపారు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  మంగళవారం రోజు జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై  గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. ‘‘ నేను మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు త‌ప్ప‌కుండా మూల్యం చెల్లించుకుంటారు. భారత్ తీవ్రంగా స్పందిస్తుంది’’ అని పేర్కొన్నారు. 2021 నవంబర్‌లో కూడా గౌతమ్ గంభీర్‌కు ఇదే తరహాలో బెదిరిస్తూ ఈ మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read :Operation Karre Guttalu: హెలికాప్టర్ల చక్కర్లు.. కాల్పుల శబ్దాలు.. బాంబు పేలుళ్లు.. ఆపరేషన్ కర్రెగుట్ట

మా ప్రధానిని చూస్తుంటే సిగ్గేస్తోంది : డానిష్ కనేరియా 

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్ ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని చాలామంది పాకిస్తానీలు తప్పుపడుతున్నారు. ఇలాంటి మౌనం సరికాదని, పాకిస్తాన్‌కే పెనుముప్పు అని వారు చెబుతున్నారు.  షెహబాజ్‌ షరీఫ్‌ను విమర్శించే వారి జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా(Gautam Gambhir) కూడా చేరిపోయారు. ‘‘వాస్తవం ఏమిటో  ప్రధాని షరీఫ్‌కు తెలుసు.  ఆయన ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. పాకిస్థాన్‌కు ఎలాంటి పాత్ర లేకపోతే నేరుగా ప్రధాని షరీఫ్‌ ఎందుకు ఖండించలేదు. ఎందుకు ఒక్కసారిగా పాకిస్తాన్‌లో హై అలెర్ట్‌ ప్రకటించారు? షరీఫ్ గారు వాస్తవం ఏమిటో మీకు తెలుసు. మీరే టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించి పెంచి పోషిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది’’ అని డానిష్ కనేరియా వ్యాఖ్యానించారు.

  Last Updated: 24 Apr 2025, 12:01 PM IST