Gas Cylinder Explosion : కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న మడ్‌పైప్ కేఫ్ నాలుగో అంతస్తులో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలింది. దీంతో ఆ భవనంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలవడంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఎంతమంది చనిపోయారు ? అనేది తెలియాల్సి ఉంది. ఈ పేలుడు సంభవించిన వెంటనే ఒక యువకుడు సాహసం చేసి.. భవనం నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. అతడికి స్వల్ప గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ కేఫ్ లో అంటుకున్న మంటలను ఆర్పేందుకు 6 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బెంగళూరులోని ప్రముఖ ఫోరమ్ మాల్‌కు ఎదురుగా ఉన్న తావరేకెరె మెయిన్ రోడ్‌లోని ‘కల్ట్ ఫిట్’ కు కొంచెం దిగువనే మడ్‌పైప్ కేఫ్ ఉంది. ఈ కేఫ్ లో హుక్కా బార్, పబ్ (Gas Cylinder Explosion) నిర్వహిస్తుంటారు.
We’re now on WhatsApp. Click to Join.
"ಸಂಚಾರ ಸಲಹೆ "
ಮರಿಗೌಡ ರಸ್ತೆಯ, ತಾವರೆಕೆರೆ ಜಂಕ್ಷನ್ ಬಳಿಯ ನೆಕ್ಸಾ ಮತ್ತು ಕಲ್ಟ್ಫಿಟ್ ಕಟ್ಟಡದಲ್ಲಿ ಬೆಂಕಿ ಕಾಣಿಸಿಕೊಂಡಿದ್ದು, ನಿಧಾನಗತಿಯ ಸಂಚಾರವಿರುತ್ತದೆ. ದಯವಿಟ್ಟು ಸಹಕರಿಸಿ. pic.twitter.com/KQQYwJSLjO
— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) October 18, 2023
ఈ సంఘటనలో ఎగిసిపడుతున్న మంటలు పరిసరాల్లోని భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే జాగ్రత్త చర్యలు చేపట్టారు. పక్క భవనాల్లోని వాళ్లను బయటికి పంపించారు. ఆ భవనాల్లోని పేలుడు స్వభావం కలిగిన సిలిండర్ల వంటి ఉపకరణాలను బయటకు తరలించారు. ఈ ఘటనతో పరిసరాలను పొగమేఘాలు కమ్మేశాయి. పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.