Gali Janardhana Reddy: తెరపైకి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి

రాజకీయ నాయకుడుగా మారిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన అధికారిక నివాసం కావేరిలో కలిశారు.

Gali Janardhana Reddy: వైఎస్ఆర్ హయాంలో గాలి జనార్దన్ పేరు తరుచుగా వినిపించింది. మైనింగ్ కింగ్ గా ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగింది. అతనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరిపిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో టాయిలెట్ ని బంగారంతో నిర్మించుకున్నాడంటే అతనెంత విలాసవంతంగా బ్రతుకుతున్నాడో ప్రపంచానికి తెలిసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ మైనింగ్ కింగ్ పేరు మరోసారి చర్చనీయాంశమైంది.

రాజకీయ నాయకుడుగా మారిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన అధికారిక నివాసం కావేరిలో కలిశారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్‌ తంగడగి కూడా పాల్గొన్నారు.

ఫిబ్రవరి 27న మంగళవారం నాలుగు స్థానాలకు రాజ్యసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిస్తారనే విషయంపై జనార్ధనరెడ్డి నోరు మెదపలేదు. కర్ణాటక నుంచి నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏఐసీసీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌, రాజ్యసభ ఎంపీ సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌, జీసీ చంద్రశేఖర్‌లను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది.

రాజ్యసభకు ఎన్‌డిఎ అభ్యర్థులుగా జెడి-ఎస్ నుండి సీనియర్ బిజెపి నాయకుడు నారాయణ్స బండేగే మరియు కుపేంద్ర రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఐదో అభ్యర్థిగా కుపేంద్రరెడ్డిని రంగంలోకి దించడంతో అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Also Read: Mohan Babu : నా పేరును పొలిటికల్‌గా వాడుకోవద్దు.. మోహన్ బాబు హెచ్చరిక