Site icon HashtagU Telugu

Lust Story: బ్యాంక్ మేనేజర్ తో తల్లి, కూతురు అక్రమ సంబంధం.. అల్లుడిని లేపేసిన వైనం

Murder

Murder

Lust Story: పెళ్లైన నెల రోజులకే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది సాధారణ హత్య కాదు… ప్రేమ పేరుతో, అక్రమ సంబంధాల పేరు జాబితాలోకి చేరిన మరో నరరూప రాక్షసత్వం. తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ హత్య కేసు ఇప్పుడంతా చర్చకు కేంద్ర బిందువుగా మారింది.

33 ఏళ్ల తేజస్విన్, కర్నూల్‌కు చెందిన సర్వేయర్‌. ఇతడు ఇటీవలే ఐశ్వర్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఐశ్వర్యకు మాత్రమే కాదు, ఆమె తల్లి సుజాతకు కూడా కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావుతో అక్రమ సంబంధం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి అయ్యింది. తల్లి, కూతురు ఇద్దరూ మేనేజర్ మాయలో చిక్కుకున్నారని, ఆ మాయగాడి కోరికల కోసమే ఈ దారుణానికి పాల్పడ్డారన్నది బంధువుల ఆరోపణ.

గత నెల 17న భూమి కొలవాలి అనే నెపంతో ముగ్గురు వ్యక్తులు తేజస్విన్‌ను పిలిపించి కారులో తీసుకెళ్లారు. గద్వాల మండలం పూడూరు శివారులో కారులోనే కత్తులతో అతడిపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యం ప్రాంతంలో పడేసి పరారయ్యారు.

ఈ హత్య వెనుక ప్లానింగ్ అంతా తల్లీ కూతుళ్లు.. సుజాత, ఐశ్వర్య లతో పాటు తిరుమల్ రావు కలసి చేశారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. సుపారి గ్యాంగ్‌ను అపాయింట్ చేసి అల్లుడిని హతమార్చిన ఘనతను వీరే దక్కించుకున్నట్టుగా పోలీసుల అంచనా.

తిరుమల్ రావు ఇప్పటికే సుజాతతో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. అదే సమయంలో అతడి కన్ను ఐశ్వర్యపైనా పడింది. ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ తన మొదటి భార్య ఒప్పుకోకపోవడంతో ఐశ్వర్యను వెనక్కి పంపాడు. అప్పటికే తేజస్విన్‌ జీవితంలోకి వచ్చిన ఆమెను అడ్డుగా భావించి, తేజస్విన్‌ను అడ్డు తొలగించడానికి పథకం రచించినట్టు అనుమానం. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారు.

Amazon : అమెజాన్ కొత్త సర్వీస్..ఇంట్లోనే వైద్య పరీక్షలు