Bihar Special Status : బీహార్ లో ‘ప్ర‌త్యేక హోదా’ చిచ్చు

ప్ర‌త్యేక హోదాపై బీజేపీ, జేడీయూ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం ప్రారంభం అయింది. తాజాగా కేంద్రం విడుద‌ల చేసిన రాష్ట్రాల ర్యాంకుల ఆధారంగా ప్ర‌త్యేక హోదా బీహార్ కు ఇవ్వాల‌ని సీఎం నితీష్ కేంద్రానికి లేఖ రాశారు.

  • Written By:
  • Updated On - December 16, 2021 / 01:15 PM IST

ప్ర‌త్యేక హోదాపై బీజేపీ, జేడీయూ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం ప్రారంభం అయింది. తాజాగా కేంద్రం విడుద‌ల చేసిన రాష్ట్రాల ర్యాంకుల ఆధారంగా ప్ర‌త్యేక హోదా బీహార్ కు ఇవ్వాల‌ని సీఎం నితీష్ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో అక్క‌డి సంకీర్ణ‌ ప్రభుత్వానికి బీజేపీ ప‌రోక్షంగా ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను పోషిస్తోంది. వాస్త‌వంగా ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్ర‌భుత్వం ఉంది. అతి పెద్ద పార్టీగా బీజేపీ అవ‌త‌రించిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల ముందు పొత్తు ధ‌ర్మాన్ని పాటిస్తూ నితీష్ కుమార్ కు సీఎం ప‌ద‌విని బీజేపీ అప్ప‌గించింది.

ప్ర‌జా బాహుళ్యం ఉండే ప్రాంతాల్లో న‌మాజ్ ను ర‌ద్దు చేయాల‌ని తాజాగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. దానితో పాటు బీహార్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రంలేద‌ని బీజేపీ కి చెందిన డిప్యూటీ సీఎం ఉన్న రేణుదేవి అంటున్నారు. ఆ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మ‌ని 2009 ఎన్నిక‌ల నుంచి నితీష్ కుమార్ ప‌లుమార్లు డిమాండ్ చేశాడు. కానీ, బీజేపీతో పొత్తు వెళ్లినప్ప‌టి నుంచి ఆ స్లోగ‌న్ ను వెన‌క్కు తీసుకున్నాడు. కానీ, తాజాగా విడుద‌లైన ర్యాంకు ఆధారంగా ప్ర‌త్యేక‌హోదా డిమాండ్ ను మ‌ళ్లీ తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. దీనితో ఆయ‌న వాల‌కంపై డిప్యూటీ సీఎం. రేణుదేవి మండిప‌డుతున్నాడు.నీతి ఆయోగ్ గ‌త నెల‌లో ఆయా రాష్ట్రాల ఆర్థిక సామాజిక అంశాల‌ను తీసుకుని ర్యాంకుల నిర్థారించింది. దాని ప్ర‌కారం అత్యంత పేద రాష్ట్రంగా బీహార్ ఉంద‌ని తేల్చింది. మానవాభివృద్ధి, తలసరి ఆదాయం, జీవన సౌలభ్యం త‌దిత‌ర ప్ర‌మాణాల‌ను తీసుకుని ర్యాంకుల‌ను నిర్థారించింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే త‌క్కువ ర్యాంకు బీహార్ కు నీతి ఆయోగ్ ఇచ్చింది. ఆ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదాను కోరుతూ నితీష్ కేంద్రానికి లేఖ రాశాడు. స‌రిగ్గా ఈ అంశంపై బీజేపీ, జేడీయూ మ‌ధ్య అంత‌రం ఏర్ప‌డింది.

Modi Govt: ఎన్నికల వ్యవస్థలో మోదీ కీలక మార్పులు.. ఐదు రాష్ట్రాల్లో గెలిచేందుకేనా?

2005లో నితీష్ సీఎంగా ఉన్న‌ప్పుడు బీహార్‌లో ఒక వ్యక్తి సగటు ఆదాయం కేవలం రూ.7,000 మాత్రమే. ఇప్పుడు అది రూ. 43,000 పైన ఉంది. కానీ ఇప్పటికీ జాతీయ సగటు కంటే చాలా వెనుకబడి ఉంది, ”అని నితీష్ వ్యాఖ్యానించారు.
కానీ, ప్ర‌త్యేక హోదాకు మించిన విధంగా కేంద్ర‌ ప్రభుత్వం ఇప్పటికే బీహార్‌కుఎక్కువ నిధులను విడుదల చేస్తోంద‌ని డిప్యూటీ సీఎం రేణుదేవి గుర్తు చేశారు. దీంతో ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం ప్రారంభం అయింది.గత వారం, బిజెపి ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ హర్యానాలో కొత్త నిబంధనల తరహాలో పబ్లిక్ నమాజ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆయనకు బీజేపీ మంత్రి సామ్రాట్ చౌదరి మద్దతు పలికారు.బిజెపికి చెందిన బీహార్ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా జేడీయూకు స‌మాచారం ఇవ్వ‌కుండా శీతాకాల‌ సమావేశాలలో ఎమ్మెల్యేలతో జాతీయ గీతం ఆలపించాడు. నితీష్ హయాంలో తొలిసారిగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై హౌస్ కమిటీ విచారణ జరుపుతుందని ప్రకటించినప్పుడు స్పీకర్ మరో విధంగా స్పందించించాడు. JD(U) మంత్రి నేతృత్వంలోని గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక ఇంజనీర్ అవినీతికి సంబంధించిన ఒక ప్రశ్నకు విచారణకు హౌస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించాడు.ఆ క‌మిటీకి సీఎంకు వ్య‌త‌రేకంగా ఉండే నితీష్ మిశ్రాను అధిపతిగా నియమించడం జేడీయూకు మండిపోతోంది. ఈ వారం లోక్‌సభలోనూ జెడి(యు), బిజెపిల మధ్య లోక్ స‌భ‌లోనూ విభేదాలు బయటపడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయంలో, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎంజిఎస్‌వై) కింద రోడ్డు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బిహార్ ప్రభుత్వం వెనుకబడి ఉందని బిజెపి ఎంపి రామ్ కృపాల్ యాదవ్ విమర్శించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా యాదవ్ వాదనలకు మద్దతుగా గణాంకాలను ఉటంకించారు.దీనిపై అనూహ్యంగా, జెడి(యు) నాయకులు మండి పడ్డారు. ఎన్టీయే ప్ర‌భుత్వం బీహార్ రాష్టంలోనూ, కేంద్రంలోనూ ఉంద‌ని మంత్రి గిరిరాజ్ కూడా బీహార్‌కు చెందినవారేనని జెడి(యు) జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ గుర్తు చేశాడు.

మ‌హిళ‌ల వివాహ వ‌య‌సు పెంపు..కేంద్ర కేబినెట్‌ ఆమోదం

గవర్నర్ మ‌ధ్యే మార్గం
బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ నియమించిన వివాదాస్పద యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను తొలగించాలని గత నెలలో నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. మగద్‌ యూనివర్సిటీ వీసీ కార్యాలయంలో విజిలెన్స్‌ సోదాలు నిర్వహించగా, భారీ మొత్తం లెక్కల్లో చూపని నగదు బయటపడడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. వివాదాస్పద వీసీల తొలగింపుపై చర్చించేందుకు నవంబర్ 24న చౌహాన్‌తో సీఎం నితీశ్ చ‌ర్చించాడు. అయిన‌ప్ప‌టికీ ఇప్పటి వరకు గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం సీఎం నితీశ్ కు కేంద్రం ప్ర‌భుత్వ మ‌ద్ధ‌తు ఇవ్వ‌డంలేద‌ని తెలుస్తోంది.
చీలికకు కారణమేమిటి?
జేడీయూ-బిజెపి కూటమి గతంలో చాలా దుర్భరమైన క్షణాలను చూసింది. ఇరు పార్టీల‌ సభ్యుల ప్రకటనలను మాడ్యులేట్ చేయడానికి సుశీల్ కుమార్ మోడీ, నంద్ కిషోర్ యాదవ్ వంటి అనుభవజ్ఞులైన బిజెపి నాయకులు ఇప్పుడు లేక‌పోవ‌డంతో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. పాలనలో నితీష్ కుమార్ యొక్క స్వంత ఇమేజ్ పడిపోవ‌డం ఇరు పార్టీల మ‌ధ్య విభేదాల‌కు కార‌ణంగా చెబుతున్నారు. ఒక‌ప్పుడు నితీష్ బీజేపీ, జేడీయూ కూటమికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. కానీ, అతను ప్రస్తుతం “జూనియర్ భాగస్వామి”, రాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి 74 సీట్లతో పోలిస్తే 43 సీట్లు ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికలలో NDA కూటమి గెలవలేకపోయింది. నితీష్ రాజ‌కీయంగా బీజేపీకి ఆస్తిగా కాకుండా సామాన్యుడు త‌ర‌హాలో కనిపిస్తున్నాడు. సో..తాజాగా ఇరు పార్టీల అగాధంగా మారిన ప్ర‌త్యేక హోదా బీహార్ రాజ‌కీయాల‌ను మార్చేయ‌నుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. ఏం జ‌రుగుతుందో..చూద్దాం.!