US Visas : అమెరికాకు వెళ్లి చదువుకోవాలని, జాబ్స్ చేయాలని చాలామంది భారతీయులు కోరుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. భారతీయుల కోసం అదనంగా 2.5లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులో ఉంచుతామని అమెరికా ప్రకటించింది. టూరిస్టులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థులకు ఈ వీసాలను మంజూరు చేస్తామని వెల్లడించింది. దీనిపై భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Visas) ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read :2 Crore SIMs : ఫేక్ సిమ్‌కార్డుల ఖేల్ ఖతం.. కోట్లాది ‘సిమ్’లు రద్దు!
అదనంగా కేటాయించిన ఈ స్లాట్‌ల వల్ల ఎంతోమంది భారతీయ వీసా దరఖాస్తుదారులు సకాలంలో ఇంటర్వ్యూలను కంప్లీట్ చేసుకుంటారని తెలిపింది. గతేడాదిలాగే ఈసారి కూడా పది లక్షలకుపైగా నాన్ ఇమిగ్రెంట్ వీసా అపాయింట్‌మెంట్లను చేపట్టామని చెప్పింది. ప్రస్తుతం కుటుంబీకులు, బిజినెస్, టూరిస్టులపై ఫోకస్ పెట్టామని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థి వీసాలను జారీ చేస్తామని తేల్చి చెప్పింది. 2023లో అమెరికా అత్యధికంగా 1.4లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసింది.
Also Read :Panther Attack : వామ్మో పులి.. 11 రోజుల్లో ఏడుగురిని చంపేసింది
భారతీయులకు ఆస్ట్రేలియా శుభవార్త
మరోవైపు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి భారత పౌరులకు ఏటా 1000 వర్క్ అండ్ హాలిడే వీసాలను అందించనుంది. ఈ వీసాలను పొందే 18 నుంచి 30 ఏళ్లలోపు భారతీయులు 12 నెలల పాటు ఆస్ట్రేలియాలో నివసించవచ్చు. ఈ వీసా కలిగినవారు నాలుగు నెలల వరకు ఆస్ట్రేలియాలో చదువుకోవచ్చు. అనేకసార్లు దేశం నుంచి రాకపోకలు సాగించవచ్చు. ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ట్రావెలింగ్ విషయంలో ఎలాంటి పరిమితి ఉండదు. అయితే వర్క్ అండ్ హాలిడే వీసాల కోసం ఏటా దాదాపు రూ.36,748 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని పొందేందుకుగానూ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న వీసా బ్యాలెట్లకు రూ.1,500 రిజిస్ట్రేషన్ ఫీజుగా పే చేయాలి.